E-Paper
Advertisement

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

Municipal Services: స్వేచ్చ బ్యూరో: వేగంగా స్థానిక అభివృద్ది, పరిపాలన సౌలభ్యం కోసం కోర్ అర్బన్ రీజియన్ ను ఇటీవలే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించినా ఇంకా సేవలు మెరుగుపడలేదు. ఫలితంగా పౌర, అత్యవసర సేవల కోసం జనం నానా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పని ఏదైనా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు తప్పటం లేదని కోర్ అర్బన్ రీజియన్ ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోని 12 జోన్లలో దాదాపు ఒకరిద్దరు మినహా మిగిలిన జోనల్ కమిషనర్లంతా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా, ప్రజలు ఆశించిన స్థాయిలో సేవలు మెరుగుపడటం లేదన్న వాదనలున్నాయి.

తిరగాల్సిన పరిస్థితి..

ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలకు అక్యుపెన్సీ సర్టిఫికెట్లతో పాటు ట్యాక్స్ సంబంధిత ఇతర సేవలను కార్పొరేషన్ల వారీగా మ్యాపింగ్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవటంతో ప్రజలు ఏ చిన్న పనికైనా కార్పొరేషన్ల ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో జోనల్ కమిషనర్ల వద్ద ఫైళ్లు వంద సంఖ్యలో పేరుకుపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలకు జారీ చేయాల్సిన అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి రెండు జోన్లలో సుమారు రెండు వందల పై చిలుకు ఫైళ్లు గడిచిన ఏడాదిగా పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది.

ఫోబియాలో ఉన్నతాధికారులు..

ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తుల మాట అలా ఉంచితే, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల దరఖాస్తులను అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవటం, పైగా ఏ ఫైలును ముట్టుకుంటే తమకెలాంటి పరిణామాలు ఏదురవుతాయోనన్న ఫోబియాలో ఉన్నతాధికారులున్నట్లు వాదనలున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొన్ని నిబంధనలను మినహాయించి నిర్మాణ అనుమతులను జారీ చేసే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా జోనల్ కమిషనర్లు కృషి చేయటం లేదని, ఫలితంగా రియల్టర్లు, భవన యజమానులు నిర్మాణ అనుమతుల కోసం అవస్థలు పడుతున్నట్లు తెలిసింది. ఇక నిర్మాణం పూర్తయిన భవనాలకు జారీ చేసే అక్యుపెన్సీ సర్టిఫికెట్ల విషయంలో కనీసం ఫైలును పరిశీలించేందుకు, క్షేత్ర స్థాయిలో భవనాన్ని సందర్శించి డీవియేషన్లను అంచనా వేసేందుకు కూడా జోనల్ కమిషనర్లు చొరవ చూపటం లేదని తెల్సింది.

Also Read: ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

పెండింగ్‌లో పనులు..

ముఖ్యంగా డీవియేషన్స్ సంబంధించి లోపాలు విజుబిలిటీగా కన్పించే అవకాశముండటంతో, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తే మున్ముందు తమకెలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయం అధికారులను వెంటాడుతుంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో ఒక జోనల్ కమిషనర్ ఎక్కువ సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో పెడితే, అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు తనను అక్కడి నుంచి బదిలీ చేయిస్తారని భావిస్తూ, నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల దరఖాస్తులను ఏ మాత్రం పరిశీలించకుండానే పెండింగ్ లో పెడుతున్నట్లు కూడా విమర్శలున్నాయి.

ఇంకా పూర్తి కాని మ్యాపింగ్..

గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నట్లు సర్కారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత అధికారులు ఆగ మేఘాలపై విలీన ప్రక్రియను చేపట్టారు. విలీనానంతరం జీహెచ్ఎంసీ పరిధి ఒక్కసారిగా 2 వేల 53 కిలోమీటర్లకు పెరిగి, దేశంలోనే అతి పెద్ద గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. దీంతో అప్పటి వరకు 27 పట్టణ స్థానిక సంస్థల్లో అంతంతమాత్రంగా ఉన్న పౌర సేవల నిర్వహణను పాత జీహెచ్ఎంసీ స్థాయిలోకి తీసుకువచ్చేందుకు అన్ని విభాగాల్లో మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టిన అధికారులు అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు.

కార్పొరేషన్లకు హద్దులు

ఆ తర్వాత గత ఫిబ్రవరి 10వ తేదీతో పాలక మండలి గడువు ముగిసిన మరుసటి రోజైన 11వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించి, ఎక్కడికక్కడ కమిషనర్లను నియమించటంతో పాటు జలమండలి వంటి విభాగాలకు కూడా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లను కూడా నియమించి, మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు హద్దులను నిర్ణయించారు. కానీ అప్పటి వరకు భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ట్యాక్స్ రివిజన్ కు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లు నేటికీ పరిష్కారం కావటం లేదు.

Also Read: టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్..

ముఖ్యంగా ఎలాంటి లోపాలున్నాయోనన్న భయంతో జోనల్ స్థాయి అధికారులు భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల దరఖాస్తులను టచ్ చేయకపోగా, ట్యాక్స్ ఎక్కువ వేశారని కీసర వంటి ప్రాంతాల నుంచి వచ్చిన పిటిషన్లు నేటికీ పెండింగ్ లో ఉన్నాయి. ఇదేమిటనీ దరఖాస్తుదారులు మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ప్రశ్నించగా, జీహెచ్ఎంసీ నుంచి ఇంకా తమకు ట్యాక్స్ సెక్షన్ కు సంబంధించిన పూర్తి వివరాలు రాలేవని, మరోసారి కొత్తగా రివిజన్ పటిషన్ దాఖలు చేసుకోవాలని అధికారులు చెబుతున్నట్లు దరఖాస్తుదారులు వెల్లడించారు.

మ్యుటేషన్ ఫైళ్లు వందల్లో పెండింగ్..

జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్లు, ఫ్లాట్ల క్రయవిక్రయాలకు సంబంధించిన యజమాని పేరును మార్చుకునేందుకు దరఖాస్తుదారులకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయిలో విధులు నిర్వర్తించే డిప్యూటీ కమిషనర్లు క్లియర్ చేయటం లేదని తెల్సింది. ముఖ్యంగా హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోని 16 మండలాల్లో దాదాపు 11 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుండగా, రంగారెడ్డి జిల్లాలో మరో 20కి పై చిలుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు మ్యుటేషన్ ఛార్జీలు చెల్లించినా, ఆస్తుల యజమాని పేరు మార్చటం లేదని పలువురు కొత్తగా ప్రాపర్టీలను కొనుగోలు చసిన దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఈ రకంగా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ పరిధిలో దాదాపు వంద వరకు మ్యుటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.
టం లేదని తెల్సింది.

Also read: సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×