SA vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) ఫైనల్ జట్లు ఖరారు అయిపోయాయి. ఇవాళ లాహోర్ వేదికగా…. సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ( South Africa vs New Zealand )… మరో ఫైనల్ జట్టు ఏదో తేలిపోయింది. దక్షిణాఫ్రికా పైన… గ్రాండ్ విక్టరీ కొట్టిన న్యూజిలాండ్…. ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ రెండు విభాగాల్లో కూడా… బ్లాక్ క్యాప్స్ అదరగొట్టారు. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో… 9 వికెట్లు నష్టపోయిన సఫారీలు 312 పరుగులు చేసి… ఓడిపోవడం జరిగింది. అయితే చివరలో డేవిడ్ మిల్లర్ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చివర్లో 67 బంతుల్లోనే సెంచరీ చేసి దుమ్ము లేపాడు. ఇందులో 10 బౌండరీలతో పాటు నాలుగు సిక్సర్లు ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ కు మరో బ్యాట్స్మెన్.. అండగా నిలిస్తే మ్యాచ్ గెలిపించేవాడే. కానీ.. అందరూ అవుట్ కావడంతో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది.
Also Read: SRH Fan Meet: IPL 2025 కంటే ముందే ఫాన్స్ కు గుడ్ న్యూస్.. SRH కీలక ప్రకటన !
అటు సఫారీలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా…. వాళ్లను కట్టడి చేశారు న్యూజిలాండ్ ప్లేయర్లు. బ్యాటింగ్ సమయంలో కేన్ మామ, ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడారు. సెంచరీలతో రెచ్చిపోయారు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. లక్ష్యాన్ని చేదించలేకపోయింది సఫారీ జట్టు. దీంతో టీమిండియాతో ఫైనల్ ఆడేందుకు బెర్త్ కన్ఫామ్ చేసుకుంది న్యూజిలాండ్. అటు ఎప్పటిలాగే… సఫారీ జట్టు… ఐసీసీ నాకౌట్ స్టేజీలోనే వెనుదిరిగింది.
దాదాపు మూడు సంవత్సరాలుగా సౌత్ ఆఫ్రికా ఇలాంటి పరిణామాలే ఎదుర్కొంటోంది. మహిళల జట్టుతో పాటు పురుషుల జట్టుకు అదే పరిస్థితి నెలకొంది. నాకౌట్ స్టేజి వరకు దక్షిణాఫ్రికా ప్లేయర్లు బాగా ఆడి…. సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ లలో తేలిపోతున్నారు. ఏదేమైనా ఇవాల్టి మ్యాచ్ లో ఓడిపోయి సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళింది. న్యూజిలాండ్ మాత్రం ఫైనల్ కు దూసుకువెల్లింది. ఇప్పటికే టీమిండియా ఫైనల్ లో ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Virat – Anushka: గ్రౌండ్ లోనే కోహ్లీ, అనుష్క రొమాం***టిక్ సైగలు.. ఫిదా కావాల్సిందే !
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand ) మధ్య… బిగ్ ఫైట్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఎగరేసుకు వెళ్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్…. భారత కాలమానం ప్రకారం మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ప్రసారాలను జియో హాట్ స్టార్ ఉచితంగానే ప్రసారం చేయబోతుంది. జియో హాట్ స్టార్ లోనే కాకుండా… స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 లో కూడా చూడవచ్చు.