BigTV English
Advertisement

MP High Court : పురుష టీచర్లకు వ్యక్తిగత గోపత్య సమస్య – ఏకంగా హైకోర్టులో పిటిషన్

MP High Court : పురుష టీచర్లకు వ్యక్తిగత గోపత్య సమస్య – ఏకంగా హైకోర్టులో పిటిషన్

MP High Court : విధులు హాజరైనట్లుగా పాఠశాల దగ్గర జియో ట్యాగ్ చేసిన ఫోటో దిగి జిల్లా విద్యాశాఖకు సంబంధించిన వాట్సాప్ నంబర్ కు పంపించాలని జారీ చేసిన సర్క్యూలర్ ను సవాళు చేస్తూ.. ఇద్దరు ఉపాధ్యాయులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఫోటోలు పంపించడం వల్ల గోపత్యకు భంగం కలుగుతుందని ఇద్దరు పురుష ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. సదరు పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు కోర్టుకు వచ్చిన ఉపాధ్యాయులకు జరిమానా విధించింది. మగ వారి వ్యక్తిగత గోప్యతకు ఎలా భంగం కలుగుతుందని ప్రశ్నించింది.


తరచూ ఉపాధ్యాయులు పాఠశాలలకు చెప్పాపెట్టకుండా మానేస్తున్న నేపథ్యంలో.. జియో ట్యాగ్ చేసిన ఫోటోలు ప్రతీ రోజు పంపించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు సూచించారు. దీంతో.. ఇద్దరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను కొట్టివేసిన జస్టిస్ ఆనంద్ పాఠక్, జస్టిస్ హిర్దేశ్ లతో కూడిన ధర్మాసనం.. మగవారు గోప్యతా సమస్యలతో కోర్టుకు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విధుల నుంచి తప్పించుకునేందుకు, పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా తప్పించుకునేందుకు వారు చేసిన ప్రయత్నంగా గుర్తిస్తూ.. ఇద్దరు ఉపాధ్యాయులపై ఒక్కొక్కరికి ₹2,500 జరిమానా విధించింది. అయితే, మహిళా సిబ్బంది వాట్సాప్ ద్వారా పంపిన ఫోటోలను ఎవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కోర్టు అంగీకరించింది. అందుకే.. హాజరు రుజువుగా పరిగణిస్తూ.. క్యాంపస్ లేదా ప్రిన్సిపాల్ కార్యాలయం ఫోటోలను పంపడానికి వారికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

ప్రతి స్మార్ట్ ఫోన్ META-DATAను కలిగి ఉంటుంది కాబట్టి… కంట్రోల్ రూమ్ META-DATA ఆధారంగా ఆ సిబ్బంది వాస్తవ హాజరును తెలుసుకుంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. గోప్యతా సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులోని మార్గాల్ని అన్వేషించాలని కోర్టు సూచించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం (MAP-IT) నుంచి ప్రత్యేక ‘యాప్’ను సృష్టించడం, లేదా ఇప్పటికే ఉన్న యాప్ ను సవరించడం ద్వారా స్పష్టమైన పరిష్కారంతో ముందుకు రావాలని హైకోర్టు సూచించింది. తద్వారా మహిళా సిబ్బంది, విద్యార్థినుల గోప్యతను కాపాడవచ్చని, అదే సమయంలో పురుష లేదా స్త్రీ అనే తేడా లేకుండా ఉపాధ్యాయుల హాజరును నిర్ధారించాలి సూచించింది. ఇలాంటి సాంకేతిక విధానాలను అవలంభించడం ద్వారా.. ఉపాధ్యాయులు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్లి విద్యార్థులకు విద్యను అందించాలని కోర్టు సూచించింది. కొందరు ఉపాధ్యాయులు కొన్ని సమయాల్లో పాఠశాలలకు హాజరు కాకపోవడంతో విదిష జిల్లా పంచాయతీ CEO నవంబర్ 2024లో సర్క్యులర్ జారీ చేశారు.


Also Read : ISI Honey trap : భారత్ లోని ఆ రైల్వే స్టేషన్ పై పాక్ మహిళల గురి – తియ్యని మాటలతో మాయచేస్తుంటారు

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యను అందించడంలో చాలాసార్లు బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నారన్న హైకోర్టు.. వారు జాతి నిర్మాతలు అని గుర్తు చేసింది. ఉపాధ్యాయులు భావితరాలకు ఉత్తమ విద్యను అందించాలని సూచించింది. అదే సమయంలో.. ఉపాధ్యాయులు ఎన్నికల విధులు, జనాభా లెక్కలు సహా ఆరోగ్య సంబంధిత సర్వేలు మొదలైన వాటితో అధిక భారాన్ని మోస్తున్నారని అంగీకరించింది. కానీ.. వారి ప్రధాన పని విద్యార్థులకు విద్యను అందించడమే అన్నది. కాబట్టి పాఠశాల హాజరు కోసం జారీ చేసిన సర్క్యులర్‌లో సూచించిన విధంగా సాంకేతికత ద్వారా ఉపాధ్యాయుల హాజరును నిర్ధారించడానికి ప్రయత్నిస్తే.. అది వారి ఆమోదాన్ని పొందేలా ఉండాలని సూచించింది.

Tags

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×