BigTV English

Sachin Tendulkar : భారత్ మాస్టర్ బ్లాస్టర్ కు అరుదైన గౌరవం …

Sachin Tendulkar : భారత్  మాస్టర్ బ్లాస్టర్ కు అరుదైన గౌరవం …
Sachin Tendulkar

Sachin Tendulkar:  మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న 2023 ప్రపంచ కప్ ప్ గ్లోబల్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ ఐసీసీ నియమించడం జరిగింది. భారత దిగ్గజ ఆటగాడు అయినా సచిన్ తన కెరియర్లో ఇప్పటికీ 50 ఓవర్ల ప్రపంచ ఆరు ఆటల్లో పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు ఎవరు చేదించలేని ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ కూడా. అయితే ఈ అరుదైన ఆటగాడికి…జరగబోయే ప్రపంచ కప్ పోటీలలో ఒక అరుదైన అవకాశం లభించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభం కానున్న మ్యాచ్ కి ముందుగా సచిన్ ప్రపంచ కప్ ట్రోఫీ తో ఈ టోర్నమెంట్ ని ప్రారంభిస్తారు.


ఇంతటి అరుదైన అవకాశం తనకు లభించిన సందర్భంగా తన మనసులోని భావాలను వ్యక్తీకరించిన సచిన్ “1987లో ఒక బాల్ బాయ్ గా ఉన్నప్పటి నుంచి ఆరుసార్లు దేశానికి వహించే వరకు.. ప్రపంచ కప్ అనేది ఎప్పుడూ నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 2011లో ప్రపంచ కప్ గెలవడం నా క్రికెట్ ప్రయాణంలోనే అత్యంత గర్వకారణమైన విషయం. ఇప్పుడు జరగబోయే ప్రపంచ కప్ పోటీలలో ఆటగాళ్లు మంచి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ అద్భుతమైన టోర్నమెంట్ కోసం నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.”అని అన్నారు.

ఇక రేపు అనగా అక్టోబర్ 5వ తారీఖున ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ 2023…క్రికెట్ అభిమానులలో ఉత్సాహాన్ని రేపుతోంది.. ఎందుకంటే 2011 తర్వాత తిరిగి భారత్ వన్డే ప్రపంచ కప్ ను సాధించింది లేదు. ఎప్పుడు సెమీస్ గండం దాటలేక వెనక్కి తిరుగుతున్న టీమిండియా ఈసారైనా కప్ తన ఖాతాలో వేసుకోవాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. 12 ఏళ్ల సుధీర్ఘ గ్యాప్ తర్వాత ఈసారి భారత్ వేదికగా జరగనున్న 2023 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ టీం ఇండియా ఖాతాలో చేరాలి అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


రేపు అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆయన ఇంగ్లాండ్ టీం ,రన్నరప్ న్యూజిలాండ్ టీం మధ్య జరగనున్న తొలి టోర్నీ ఆరంభం మ్యాచ్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గ్లోబల్ అంబాసిడర్ హోదాలో ప్రపంచ కప్ ట్రోఫీతో మైదానంలో అడుగు పెడతాడు. సచిన్ తో పాటుగా ప్రపంచకప్ కోసం ఐసీసీ పలువురు మాజీ క్రికెటర్లను అంబాసిడర్స్ గా ప్రకటించడం జరిగింది. వెస్టిండీస్ కి చెందిన వివియన్ రిచర్డ్స్, దక్షిణ ఆఫ్రికా మిస్టర్ 360…ఏబీ డివిలియర్స్, 2019లో ఇంగ్లాండ్కు ప్రపంచ కప్ సాధించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ సునామీ ముత్తయ్య మురళీధరన్,న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్, పాక్ ప్లేయర్ మహ్మద్ హఫీ‌జ్‌ తో పాటు టీం ఇండియా నుంచి సురేష్ రైనా మరియు మాజీ భారత్ మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ లు ఈ జాబితాలో ఉన్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×