BigTV English

Sai Sudharsan -Gill: గిల్, సాయి సుదర్శన్ లది ఫెవికల్ బంధం.. ఎవడు ఔట్ చేయలేరు

Sai Sudharsan -Gill: గిల్, సాయి సుదర్శన్ లది ఫెవికల్ బంధం.. ఎవడు ఔట్ చేయలేరు

Sai Sudharsan -Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన గ్రాండ్ విక్టరీ కొట్టి నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్ళింది గుజరాత్ టైటాన్స్. అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఏకంగా పదవి వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్. ఒక్క వికెట్ నష్టపోకుండా గిల్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరూ… చాలా ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశారు. ఈ దెబ్బకు 20 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే చేదించింది గుజరాత్ టైటాన్స్. అయితే ఈ టార్గెట్ చేదించే క్రమంలో గిల్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరూ అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నారు.


గిల్ & సాయి కాంబోలో 205 పరుగుల భాగస్వామ్యం

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన 200 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… 205 పరుగుల భాగస్వామ్యాన్ని సాయి సుదర్శన్ అలాగే గిల్ ఇద్దరు నమోదు చేశారు. ఒక్క వికెట్ నష్టపోకుండానే 19 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసి.. ప్లే ఆఫ్ కు జట్టును తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సాయి సుదర్శన్ 61 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే 12 బౌండరీలు ఉన్నాయి. 177 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు సాయి సుదర్శన్. అటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ కూడా 53 బంతుల్లోనే 93 పరుగులు చేశారు. ఇందులో ఏడు సిక్సర్లు అలాగే మూడు బౌండరీలు ఉన్నాయి. 175 స్ట్రైక్ రేటుతో రెచ్చిపోయాడు గిల్.


గిల్, సాయి సుదర్శన్ జంట అరుదైన రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో సాయి సుదర్శన్ అలాగే గిల్ ఇద్దరూ ఇలా భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2024 సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పైన 205 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం జరిగింది. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో కేఎల్ రాహుల్ అలాగే క్వింటన్ డికాక్ ఇద్దరు 2022 లో 210 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి మొదటి స్థానంలో ఉన్నారు. అప్పుడు లక్నో కెప్టెన్ గా రాహుల్ ఉన్నాడు.

గుజరాత్ జట్టు అరుదైన రికార్డు

అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని చేదించడంలో కూడా గుజరాత్ టైటాన్స్ అరుదైన రికార్డు నమోదు చేసుకుంది. ఇదే సంవత్సరం అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ పైన 204 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా గుజరాత్ టైటాన్స్ చేయించింది.. చేదనలో అదే హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. ఇవాళ మళ్లీ అదే ఢిల్లీ జట్టు పైన.. ఢిల్లీ స్టేడియంలో 200 పరుగులను చేదించింది. 2023 సంవత్సరంలో బెంగళూరు పైన 198 పరుగుల లక్ష్యాన్ని చేదించింది గుజరాత్ టైటాన్స్. అలాగే జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ పైన కూడా 2024లో 197 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఛేదించి రికార్డు సృష్టించింది. ఇలా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడానికి ముఖ్య కారణం అలాగే సాయి సుదర్శన్ ఇద్దరే. వీళ్ళ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు బౌలర్లు చాలా కష్టపడుతున్నారు. కానీ వాళ్లది ఫెవికాల్ బాండ్ కావడంతో.. ఎవరు అవుట్ చేయడం లేదు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×