Manchu Manoj: దాదాపు రెండేళ్ల క్రితం మంచు మనోజ్ తన ఇంటికి వచ్చి మా మనుషుల్ని విష్ణు ఎలా కొడుతున్నాడో చూడండి అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ బాగా వైరల్ గా మారింది. అక్కడితో మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని తెలుపుతూ ఇది రియాలిటీ షో కోసం మేము చేస్తున్న వీడియో అంటూ మంచు విష్ణు ఒక సందర్భంలో తెలిపారు అయితే అందరూ కూడా దానిని నిజమే అనుకొని నమ్మారు కానీ ఇప్పటివరకు ఆ రియాల్టీ షో విడుదల కాలేదు. గత కొద్దిరోజులుగా మంచి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మంచు విష్ణు వీరి ముగ్గురు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వచ్చేసింది.
మనోజ్ వైరల్ స్పీచ్
ఈ వివాదం ఎట్టకేలకు ఆగిపోతుంది అనుకుంటే ఇంకా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మంచి మోహన్ బాబు మనోజ్ పై దాడి చేయడం, మనోజ్ వాళ్లపై దాడి చేయడం జరిగింది. అయితే ఏదైనా రెండు రోజులే అన్నట్లు ఈ వివాదాన్ని కూడా చాలా మట్టుకు అందరూ మర్చిపోయారు. ఈ తరుణంలో మరొకసారి ఈ వివాదాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది అని చెప్పాలి. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తున్న సినిమా బైరవం ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ తరుణంలో మనోజ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
ఎప్పటికీ మోహన్ బాబు కొడుకునే
మంచు మనోజ్ మాట్లాడుతూ… కట్టు బట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు మా ఇంట్లో వాళ్ళు బట్టలు ప్రతి ఒకటి రోడ్డు మీద పెట్టారు. ఒక ఊరు వెళ్లి వచ్చేటప్పటికి బయటికి వెళ్లడానికి కార్లు కూడా లేవు. కార్లు లాక్కున్నారు. కానీ నా కోసం పది పదిహేను కార్లు వచ్చాయి మేమున్నాము అంటూ మీరు ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికీ న్యాయం వైపు నిలబడాలి అని నాకు నేర్పించింది మా తండ్రి మోహన్ బాబు గారు. కానీ నేను న్యాయం వైపు నిలబడిన కూడా ఈరోజు నన్ను తప్పు పడుతున్నారు. కానీ ఏదేమైనా మీరే నా తండ్రి మీరే నా దేవుడు నేను ఎప్పటికీ మీ కొడుకునే అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : Jabardast Rohini : లగ్జరీ విల్లా కొన్న రోహిణి.. స్టార్స్ పనికిరారు.. ఎన్ని కోట్లో తెలుసా..?