E-Paper
Advertisement

Salaries of Commentators : క్రికెట్ కామెంట్రీ చెప్పే వాళ్లకు జీతం ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే

Salaries of Commentators : క్రికెట్ కామెంట్రీ చెప్పే వాళ్లకు జీతం ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే
Advertisement

Salaries of Commentators : సాధారణంగా సినిమాలకైనా, రాజకీయాలకు అయినా.. క్రీడలకు అయినా మాటలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరైనా నాలుగు మాటలు చెప్పిన వారినే ఈ రోజుల్లో నమ్ముతున్నారు. మాటలు రాని వారు మార్కెట్ లో ప్రస్తుతం విలువ లేకుండా పోతుంది. అది ఏ రంగంలోనైనా సరే. ఇక క్రీడా రంగానికి కామెంటర్స్ చాలా ముఖ్యం అనే చెప్పాలి. క్రికెట్ విషయానికి వస్తే.. గతంలో రేడియోలో కామెంటరీ వినే వారు. కానీ ప్రస్తుతం లైవ్ వీక్షించేందుకు కూడా కామెంటరీ క్రికెట్ మజాను పెంచుతోంది. క్రికెట్ కామెంరీ గేమ్ కి ఎక్సైట్ మెంట్, ఎమోషన్ ను తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మంచి కామెంటర్ ఏం జరిగిందో అని వివరించడమే కాదు.. గేమ్ ని స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తాడు. ఉత్తమ కామెంటర్స్ చాలా వేగంగా ఆలోచిస్తారు. గేమ్ లో ఎలాంటి పరిస్థితిని అయినా నిర్వహించడానికి సిద్ధంగా ఉంటారు.

రవిశాస్త్రీ, టోనీ గ్రేగ్, రిచీ బెనాడ్, హర్షా బోగ్లే, మార్క్ నికోలస్, పీటర్ డ్రూరీ, మార్టిన్ టైలర్, రే వారెన్ వంటి వారు క్రికెటర్ అభిమానులను తమ కామెంటరీ ద్వారా అలరిస్తున్నారు. మరోవైపు స్కై స్పోర్ట్స్, BBC, BT స్పోర్ట్స్, ఛానల్ నైన్ మొదలైన బ్రాడ్ కాస్టింగ్ హౌస్ లు చాలా కీలకమైన పర్యటనల కోసం మంచి వ్యాఖ్యాతలను ఎంపిక చేయడం పై ఎక్కువ ప్రాధానత్య ఇస్తాయి. వారి పాత్రలు, బాధ్యతలు చాలా స్పష్టంగా కేటాయించబడ్డాయి. కామెంటర్స్ అన్ని మ్యాచ్ లు, సిరీస్ లు, టోర్నీలకు సేవలు అందిస్తున్నారు. సాధారణంగా జూనియర్  కామెంటర్స్ కి సీనియర్ కామెంటర్స్ కి సాలరీలో చాలా తేడా ఉంటుంది. జూనియర్ కామెంటర్స్ కి 35 నుంచి 40 వేల వరకు ఉంటుంది. అలాగే సీనియర్ కామెంటర్స్ కి మాత్రం 6 నుంచి 10 లక్షల వరకు ఉండనున్నట్టు సమాచారం. సీనియర్లు సంవత్సరానికి యావరేజ్ గా 10కోట్లు కామెంటరీ ద్వారా సంపాదించనున్నట్టు సమాచారం. జూనియర్ కామెంటర్స్  మాత్రం 1.5 నుంచి 2 లక్షల వరకు నెలకు సంపాదిస్తారు. సంవత్సరానికి 20 నుంచి 25 లక్షల వరకు సంపాదించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

వాస్తవానికి భారత్ లో క్రికెట్ ను ఓ క్రీడా కంటే ఎక్కువగా చూస్తారు. క్రికెట్ ను క్రమం తప్పకుండా ఫాలో అవుతారు. భారతీయ క్రికెట్ కామెంటేటర్లు ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే స్పోర్ట్స్ కామెంటేటర్లుగా నిలిచారు. వారి జీతంతో పాటు పెద్ద సోషల్ మీడియా ప్రకటనలు, ప్రమోషన్ల కోసం ఆయా బ్రాండ్ లతో కలిసి పని చేయడం వల్ల అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. ఇక ఐపీఎల్ మ్యాచ్ సమయంలో కామెంటేటర్ల ఆదాయం అమాంతం పెరుగుతుంది. ఈవెంట్ల సమయంలో టాప్ కామెంటర్స్ భారీగా సంపాదిస్తుంటారు. ఉదాహరణకు హర్షా బోగ్లే 2008 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లకు తన కామెంటరీ అందిస్తున్నాడు. రవి శాస్త్రి కూడా 2008 నుంచి ఐపీఎల్ కామెంటరీ చేస్తున్నాడు. భారత క్రికెట్ జట్టుకి ప్రధాన కోచ్ ఎన్నికయ్యాక 2017 నుంచి కొంత కాలం కామెంటరీకి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ కి కామెంటరీగా వ్యవహరిస్తున్నాడు. సునీల్ గవాస్కర్ మూడు దశాబ్దాలకు పైగా కామెంటరీ అందిస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి కామెంటేటరీ టీమ్ లో కొనసాగుతున్నాడు. వీరితో పాటు చాలా మంది ఇతర దేశస్తులు కూడా కామెంటరీ ద్వారా చాలానే సంపాదిస్తుండటం విశేషం.

?igsh=MTQ4YzFiY3c2NTF3cg==

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×