BigTV English
Advertisement

NAL Recruitment: టెన్త్, ఇంటర్‌తో అద్భుతమైన అవకాశం.. ఈ జాబ్ వస్తే మంచి వేతనం, పూర్తి వివరాలివే

NAL Recruitment: టెన్త్, ఇంటర్‌తో అద్భుతమైన అవకాశం.. ఈ జాబ్ వస్తే మంచి వేతనం, పూర్తి వివరాలివే

NAL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌(NAL) ఖాళీగా ఉన్న పలు టెక్నీషియన్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. టెన్త్‌, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించి వెకెన్సీలు, వయస్సు, జీతం, ఉద్యోగ ఎంపిక విధానం గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరటరీస్‌(NAL) ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  జులై 10న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ: AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ టాప్ -10 ర్యాంకర్లు వీళ్లే..


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 86

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరటరీస్‌ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో టెక్నీషియన్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు: 

టెక్నీషియన్ -1 పోస్టులు: 86

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు: 2025 జూలై 10వ తేదీ నాటికి 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబందనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 6

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 10

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల సెలెక్షన్ ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్  సైట్: https://nal.res.in/

ALSO READ: DRDO: డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56,100 జీతం, ఇంకా 2 రోజులే?

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 86

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 10

Related News

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Big Stories

×