Pushpa2 kerala Event : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మూవీకి సంబంధించిన ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక్కడే ఈ సినిమా ప్రమోషన్స్ ని తన భుజాల మీద వేసుకున్నాడని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కేరళలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కేరళ ఈవెంట్ పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ అసలు ఏం మాట్లాడాడు..? ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
బుధవారం పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ కోసం కొచ్చిలో ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఆ ఈవెంట్ లో కేరళ అభిమానులను ఆకట్టుకునేందుకు అల్లు అర్జున్ బాగానే స్పీచ్ ని ప్రిపేర్ చేసుకొని వచ్చాడు. ముందుగా మలయాళ నటుల గురించి బాగానే మాట్లాడాడు. అందులో ఫహద్ ఫాజిల్ గురించి బాగానే చెప్పాడు. తన ఫ్యాన్స్, తన ఆర్మీ గురించి చెబుతూ.. ఆర్మీ అనేది కేరళ నుంచే స్టార్ట్ అయిందని అన్నాడు బన్నీ. ఇక అంతేకాదు.. ఇక తన స్పీచులో పదే పదే “అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ” అని చెప్పుకుని సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నాడు. తన స్పీచ్ అంతా పక్కన పెడితే.. బన్నీ వాసు బన్నీ పేర్లు కన్ఫ్యూజన్ గా ఉండడంతో యాంకర్లు కాస్త కన్ఫ్యూజన్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ పేరుతో స్టేజ్ మీదకు పిలుస్తారు. అది కాస్త నెట్టింట ట్రోలింగ్ గురైంది.. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెటిజన్స్ మధ్య పెద్ద వారే జరుగుతున్నట్టు తెలుస్తుంది..
ఇదిలా ఉంటే.. బన్నీ ఈవెంట్ కి వేసుకొని వచ్చిన షర్టు పైన పైన ఇది నా బ్రాండ్ అని రాసి ఉండడం, అలాగే వేలుకు పెట్టుకున్న ఉంగరం ఆసక్తిగా మారింది. మరోవైపు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడం ఎందుకని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇక ఆర్మీ అని పదే పదే చెబుతుండటం మీద కూడా జనాలు నవ్వుకుంటున్నారు. బన్నీ స్పీచులు, నడిచే తీరు, చూస్తున్న విధానం ఇలా ప్రతీ ఒక్క దాన్ని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అటు పుష్ప 2 రన్ టైం ఇది కూడా ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. 3 గంటల 20 నిమిషాలు అంటే చాలా కష్టం అవుతుందని, ఏ మాత్రం తేడా కొట్టినా రిజల్ట్ వేరేలా ఉంటుందని అంటున్నారు. నిర్మాతలు మాత్రం అది అసలు సమస్యే కాదని, సినిమా ఎక్కడా బోర్ కొట్టదని అంటున్నారు. ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి..