BigTV English
Advertisement

CSK: CSKలోకి ఇద్దరు టీమిండియా వికెట్ కీపర్లు.. ఇక 2026లో రచ్చ రచ్చే..!

CSK: CSKలోకి ఇద్దరు టీమిండియా వికెట్ కీపర్లు.. ఇక 2026లో రచ్చ రచ్చే..!

CSK: ఐపీఎల్ 2025 సీజన్ 18 లో రాజస్థాన్ రాయల్స్ {RR} జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. రాజస్థాన్ రాయల్స్ కనీసం ప్లే ఆఫ్స్ కి కూడా చేరుకోలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సీజన్ లో స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ది కూడా ఇదే పరిస్థితి. ఐపీఎల్ 2026 లో ఆరోసారి కప్ సాధించాలని పట్టుదలతో ఉంది చెన్నై సూపర్ కింగ్స్.


Also Read: Gambhir on Jadeja: ఒరేయ్ నీకు బుద్ధి ఉందా…. జడేజా పై గౌతమ్ గంభీర్ సీరియస్?

అయితే రాబోయే సీజన్ కి ముందే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కాగా దీనికి అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 {సీజన్ 18} సమయంలో సంజూ శాంసన్ కి.. రాజస్థాన్ రాయల్స్ {RR} జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కి మధ్య విభేదాలు తలెత్తాయని, మేనేజ్మెంట్ తోను అతడికి పడట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు ఫ్రాంచైజీ మారాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి తోడు సంజూపై తమకు ఆసక్తి ఉందని చెన్నై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో సంజూ చెన్నై సూపర్ కింగ్స్ తో ట్రేడ్ దాదాపు ఖరారు అయిందని.. ఐపీఎల్ 2026 సీజన్ నుంచి అతడు పసుపు జెర్సీలో కనిపించవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు సంజూ మాత్రమే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, టీమిండియా స్టార్ బ్యాటర్ కే.ఎల్ రాహుల్ పై కన్నేసినట్లు సమాచారం. ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్ ని కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2025 సీజన్ లో రాహుల్ ఢిల్లీ జట్టు తరుపున ఆడాడు. అయితే ఇప్పుడు 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులోకి తీసుకోవాలని.. ఈ విషయంలో రాహుల్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

అతడు చెన్నై జట్టులోకి వస్తే రూ. 25 కోట్లు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపర్ రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓవైపు సంజూ, మరోవైపు కేఎల్ రాహుల్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరితే.. ఏకంగా ముగ్గురు వికెట్ కీపర్, మరియు స్టార్ బ్యాటర్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2026లో రచ్చ రచ్చ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు సీఎస్కే అభిమానులు.

Also Read: Josh Tongue: వీడు ఎవర్రా బాబు… ఇష్టం వచ్చినట్టు బౌలింగ్ వేశాడు.. అయినా టీమిండియాకు చుక్కలు చూపించాడు

అయితే కేఎల్ రాహుల్ ని తమ జట్టులోకి తీసుకోవాలని కలకత్తా జట్టు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఐపీఎల్ లో ఈ ట్రేడింగ్ విండో సీజన్ ముగిసిన ఏడు రోజుల తర్వాత నుంచి యాక్షన్ {వేలం}కి మరో వారం రోజుల ముందు వరకు తెరిచి ఉంటుంది. ఈ సమయంలో అన్ని జట్లు తమ ఆటగాళ్లను మార్పిడి చేసుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంజూ, కేఎల్ రాహుల్.. చెన్నై సూపర్ కింగ్స్ తో ట్రేడ్ కాబోతున్నారని, అంతా సవ్యంగా జరిగితే వచ్చే సీజన్ లో వీరిద్దరూ సీఎస్కే లో భాగస్వాములు అవుతారని ప్రచారం జరుగుతుంది.

Related News

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

SRH -IPL 2026: హైద‌రాబాద్ ఫ్యాన్స్ కు షాక్‌… కాటేర‌మ్మ కొడుకును గెంటేస్తున్న కావ్య పాప ?

IND VS SA: ఇంత‌కీ ఈ చిన్నారి ఎవ‌రు.. వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎందుకు వైర‌ల్ అయింది?

Big Stories

×