Josh Tongue: భారత్ – ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నేపథ్యంలో లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం {జూలై 31} వ తేదీన 5వ టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ యశస్వి జైష్వాల్ కేవలం 9 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసిన కేఎల్ రాహుల్.. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Also Read: Karun Nair: శభాష్ కరుణ్.. క్రీడాస్ఫూర్తిని చాటావ్… ఇంగ్లాండ్ ప్లేయర్ కోసం ఇంత త్యాగమా
దీంతో టీమ్ ఇండియా 38 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్ లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే లంచ్ తరువాత భారత జట్టును మళ్లీ కష్టాలు చుట్టుముట్టాయి. అప్పటివరకు నిలకడగా ఆడుతున్న గిల్.. అనవసర సమయంలో పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. అతడు 21 పరుగుల వద్ధ రన్ అవుట్ కాగా.. కాసేపటికే సాయి సుదర్శన్ కూడా వెనుదిరిగాడు. 108 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 64 బంతులతో 38 పరుగులు చేశాడు.
ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా {9}, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ {19} కూడా నిరాశపరిచాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 64 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కరుణ్ నాయర్ {52*}, వాషింగ్టన్ సుందర్ {19*} ఉన్నారు. ఇక తొలిరోజు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. పిచ్ కూడా బ్యాటింగ్ కి ప్రతికూలంగా మారింది. అయితే తొలి రోజు ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ మొదట రిథమ్ దొరక్క అడ్డదిడ్డంగా బౌలింగ్ వేశాడు.
ఆ తర్వాత కాసేపటికి కాస్త సెట్ అయిన అతడు.. యార్కర్లు, బౌన్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్, రవీంద్ర జడేజాను వెంటవెంటనే అవుట్ చేశాడు. ఈ క్రమంలో అడ్డదిడ్డంగా బౌలింగ్ వేసినప్పటికీ.. వికెట్లు పడగొట్టాడని.. ” ఇదేం బౌలింగ్ బ్రో” అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో తొలిరోజు గస్ అట్కిన్సన్, జోస్ టంగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్ ఓ వికెట్ తీశాడు. కాగా రెండవ రోజు ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది. ఈ మ్యాచ్ భారత జట్టుకు డూ ఆర్ డై లాంటిది.
Also Read: Yuzvendra Chahal: సూసైడ్ చేసుకోవాలనుకున్న టీమిండియా క్రికెటర్… ఆ లేడీ టార్చర్ తట్టుకోలేక!
ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడితే సిరీస్ చేజారుతుంది. గెలిస్తే ఓటమి బాధనుండి బయటపడొచ్చు. ఇక ఈ మైదానంలో భారత రికార్డు కూడా దారుణంగా ఉంది. భారత జట్టుకు ఏ టెస్ట్ సిరీస్ లో అయినా ఐదవ టెస్ట్ అంటే ఓ శాపంలా మారింది. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కేప్టెన్ కూడా విదేశీ గడ్డపై 5వ టెస్టు ను గెలవలేదు. ఇప్పటివరకు భారత్ పదసారు సార్లు విదేశాల్లో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లు ఆడింది. కానీ ఒక్కసారి కూడా చివరి టెస్ట్ లో గెలుపొందలేదు. మరి ఈ చివరి టెస్టులో భారత్ గెలుపొందుతుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి.