Gambhir on Jadeja: భారత్ – ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నేపథ్యంలో లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా గురువారం {జూలై 31} వ తేదీన 5వ టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియాకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ యశస్వి జైష్వాల్ కేవలం 9 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కే.ఎల్ రాహుల్ {14} కూడా తీవ్ర నిరాశపరిచాడు.
Also Read: Josh Tongue: వీడు ఎవర్రా బాబు… ఇష్టం వచ్చినట్టు బౌలింగ్ వేశాడు.. అయినా టీమిండియాకు చుక్కలు చూపించాడు
దీంతో భారత జట్టు 38 పరుగుల వద్ద రెండు వికెట్లను కోల్పోయింది. అనంతరం సాయి సుదర్శన్, టీమిండియా కెప్టెన్ గిల్ కాసేపు క్రీజ్ లో నిలకడగా రాణించారు. కానీ లంచ్ విరామం తర్వాత గిల్ {21} రనౌట్ కావడం, 38 పరుగులు చేసిన సాయి సుదర్శన్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో భారత జట్టును ఆదుకుంటాడని భావించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కేవలం 9 పరుగులు మాత్రమే చేసి.. జోస్ టంగ్ బౌలింగ్ లో జేమీ స్మిత్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
నిజానికి నాలుగవ టెస్టులో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించడంతో.. ఐదవ టెస్టులో అతడిపైనే చాలామంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అతడు నిరాశపరిచాడు. ఇక అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లడంతో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. జడేజా పై తీవ్రంగా సీరియస్ అయ్యాడు. తన చేతిని రవీంద్ర జడేజా మొహంపై పెట్టి చూపిస్తూ.. గౌతమ్ గంభీర్ సీరియస్ గా మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. గంభీర్ పై సీరియస్ అవుతున్నారు.
గంభీర్ అంత మంచి ఆటగాడే అయితే.. ఇంగ్లాండ్ లో అతని ప్రదర్శన గురించి మాట్లాడాలని కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఒక ఇన్నింగ్స్ లో విఫలమైనంత మాత్రాన అతడిని టార్గెట్ చేయడం భావ్యం కాదని అంటున్నారు నెటిజెన్లు. ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసింది. అయితే టీమిండియా బ్యాటింగ్ లో ఇలా విఫలం కావడానికి ప్రధాన కారణం ఓవల్ లో కురిసిన వర్షమేనని చెబుతున్నారు క్రీడా పండితులు.
Also Read: Karun Nair: శభాష్ కరుణ్.. క్రీడాస్ఫూర్తిని చాటావ్… ఇంగ్లాండ్ ప్లేయర్ కోసం ఇంత త్యాగమా
వరుస విరామ సమయాలలో వాన పడడం, స్టేడియం పచ్చిగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ బౌలర్లకు అనుకూలంగా మారింది అంటున్నారు. ఇలాంటి సమయంలోనే భారత జట్టుపై ఒత్తిడి పెంచి ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్లు సాధించగలిగారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రవీంద్ర జడేజా విషయానికి వస్తే.. ఈ ఐదవ టెస్ట్ కి ముందు కొత్త టెస్ట్ ర్యాంకింగ్స్ ని ఐసీసీ ప్రకటించింది. ఇందులో బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక స్థానం పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు. అతడికి 682 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.