Sanju Samson Run Out Resembles MS Dhoni: శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అద్భుతంగా రనౌట్ చేశాడు. శాంసన్ నో-లుక్ రన్ అవుట్ వీడియో వెంటనే అధికారిక IPL హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇది ప్రస్థుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు గతంలో భారత మాజీ కెప్టెన్ MS ధోని రనౌట్ చేసిన విధంగా శాంసన్ రనౌట్ ఉందని ట్వీట్లు చేస్తున్నారు.
మ్యాచ్ 18వ ఓవర్‌లో యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతిని పీబీకేఎస్ బ్యాటర్ అశుతోష్ శర్మ లెగ్ సైడ్‌కు స్లాగ్ చేయడంతో ఈ రనౌట్ జరిగింది. నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న లియాయ్ లివింగ్‌స్టోన్ ఒక పరుగు పూర్తి చేసుకుని స్ట్రైకింగ్ వైపు వచ్చాడు. అయితే, అరంగేట్ర ఆటగాడు తనుష్ కోటియాన్ బంతిని వేగంగా కీపర్ శాంసన్‌కు విసిరాడు. త్రో వికెట్లకు దూరంగా రావడంతో ధోనీ స్టైల్‌లో శాంసన్ వెనక్కి తిరిగిచూడకుండా బెయిల్స్‌ను గిరాటేశాడు. దీంతో లేని రెండో పరుగుకు ప్రయత్నించిన లివింగ్‌స్టోన్ రనౌట్ అయ్యాడు.
ఇప్పుడీ వీడియో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. దీంతో గతంలో మహేంద్రుడు చేసిన రనౌట్‌తో పోల్చుతున్నారు. ఇక కొంత మంది అదృష్టం కలిసొచ్చింది కాబట్టి శాంసన్ వేసిన బాల్ వికెట్లను తాకిందని.. లేదంటే లివింగ్‌స్టోన్ రనౌట్ అవ్వకపోయేవాడని అంటున్నారు. ఇక ఈ రనౌట్ మ్యచ్‌ని డిసైడ్ చేసిందని చెప్పొచ్చు. అప్పటికి ఇంకా 14 బంతులున్నాయి. ఒకవేళ లివింగ్‌స్టోన్ క్రీజులో ఉండి ఉంటే కనీసం 2 నుంచి 3 సిక్సర్లయినా కొట్టేవాడని.. ఛేజింగ్‌లో రాజస్థాన్ అతి కష్టం మీద నెగ్గిందని అలా జరిగి ఉంటే రాజస్థాన్ ఓటమి చవి చూసేదని అంటున్నారు.
Also Read: ఉత్కంఠ పోరులో చచ్చీ చెడి గెలిచిన రాజస్థాన్.. పోరాడి ఓడిన పంజాబ్
ఎలా అయితేనేం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ చేసిన రనౌట్ రెండు పాయింట్లు తెచ్చిపెట్టిందంటున్నారు. కాగా రాజస్థాన్ తమ తదుపరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మంగళవారం(ఏప్రిల్ 16) తలపడనుంది.
Excellent piece of fielding! 🙌
It's none other than the @rajasthanroyals skipper @IamSanjuSamson with a superb run-out to dismiss Livingstone 🎯
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 #TATAIPL | #PBKSvRR pic.twitter.com/iCsTjauQqV
— IndianPremierLeague (@IPL) April 13, 2024