BigTV English
Advertisement

Tiger NageswaraRao Review : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ.. మాస్ మహారాజ్ కి మరో హిట్ పడినట్లేనా ?

Tiger NageswaraRao Review : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ.. మాస్ మహారాజ్ కి మరో హిట్ పడినట్లేనా ?
Tiger NageswaraRao Review

Tiger NageswaraRao Review : మాస్ మహారాజ్ రవితేజ పూర్తి మాస్ ఓరియంటెడ్ పాత్రలో మంచి డార్క్ క్యారెక్టర్ లో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు.ఇది రవితేజ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా హైప్ పెంచడానికి భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. 1980లో స్టూవర్టుపురం దొంగైన టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల అయింది. దసరా కానుకగా బరిలోకి దిగిన ఈ సినిమా.. రవితేజకు మరో హిట్ అందించిందో లేదో చూద్దాం.


కథ

1980 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడలాడించిన దొంగల అడ్డా స్టువర్టుపురం కు చెందిన ఒక పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు (రవితేజ). టైగర్ నాగేశ్వరరావు ను పట్టుకోవడానికి ప్రయత్నించే ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌ (అనుపమ్ ఖేర్). కథ మొత్తం స్టువర్టుపురం నేపథ్యంలో దొంగల జీవితానికి సంబంధించిన చూడని ఘట్టాలను కూడా హైలెట్ చేస్తూ ముందుకు సాగుతుంది. దొంగతనం చేసేది ఒకరైతే అనవసరంగా బలయేది స్టువర్టుపురం ప్రజలు. అలాంటి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వాళ్ళ జీవితాలను వెలుగు వైపు నడిపించాలి అనే సంఘసంస్కర్త పాత్ర హేమలత లవణంది. స్టువర్టుపురంలో ఆమె ఎంట్రీ మార్పు కి నాంది.


టైగర్ నాగేశ్వరరావు ని పట్టుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించి.. ఫైనల్ గా అతని కోసం ఒక ట్రాప్ ని క్రియేట్ చేస్తారు. ఇక సినిమా క్లైమాక్స్ కి చేరుకునే కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంతకీ నాగేశ్వరరావు పోలీసుల ట్రాప్ కి చిక్కుతాడా? టైగర్ నాగేశ్వరరావు చివరికి ఏం చేస్తాడు? ఇందులో హేమలత లవణం పాత్ర ఏమిటి? ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు? తెలుసుకోవాలి అంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ పై టైగర్ నాగేశ్వరరావు మూవీ చూసేయండి.

విశ్లేషణ:

ఈ మూవీలో ప్రతి ఒక్కరు తమ క్యారెక్టర్ కి తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. మూవీ నేరేషన్ ఎంతో గ్రిప్పింగ్ గా ఉండటమే కాకుండా.. కొన్ని సీన్స్ టెన్షన్ పీక్స్ కి తీసుకు వెళ్లే విధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాస్ మహారాజ్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. కొన్ని ఫైటింగ్ సన్ని వేశాలు, చేజింగ్ సీక్వెన్స్ లు ఆకట్టుకుంటాయి. మూవీ ముందుకు వెళ్లే కొద్దీ నెక్స్ట్ ఏమవుతుంది అని ఎగ్జాస్ట్మెంట్ కలుగక మానదు.

నాజర్ దగ్గర మిగిలిన వాళ్ళతో కలిసి దొంగతనానికి ట్రైనింగ్ తీసుకునే టైగర్ నాగేశ్వరరావు క్రమంగా తన తెలివితేటలతో పెద్ద పేరు మోసిన దొంగగా ఎలా ఎదుగుతాడు అనే విషయాన్ని చాలా క్రిస్పీగా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ ఆకట్టుకునే విధంగా చిత్రీకరించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించిన కథ ఉపందుకున్నాక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఇందులో రేణు దేశాయ్ సంఘసంస్కర్త హేమలత లవణం పాత్ర పోషించారు.

దాదాపు పాతికేళ్ల తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. యాక్టర్ ఎప్పటికీ యాక్టరే.. అని రేణు దేశాయ్ ను చూస్తే తెలుసుకోవచ్చు. హేమలత లవణం పాత్రకు ఆమె నిజంగా జీవం పోశారు. ఇక స్పెషల్ ఆఫీసర్ గా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అద్భుతమైన నటన కనబరిచారు. స్క్రీన్ ప్లే దగ్గర నుంచి కథ, కథనం నడిపే విధానం వరకు ఎంతో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. రవితేజ మూవీ అంటే కామెడీ లేకుండా ఎలా ఉంటుందో.. రవితేజ మార్క్ కామెడీ అక్కడక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ నిజంగా రవితేజ కి మరొక బ్లాక్ బస్టర్ ని ఖచ్చితంగా అందిస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

చిత్రం – టైగర్ నాగేశ్వరరావు
దర్శకత్వం – వంశీ
నటులు – రవితేజ,అనుపమ్ ఖేర్,నూపూర్ సనన్రేణు దేశాయ్,జిషు సేన్‌గుప్తా
సినిమాటోగ్రఫీ – ఆర్.మధి
సంగీతం – జివి ప్రకాష్ కుమార్
నిర్మాణం – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
విడుదల తేది – 20 అక్టోబర్ 2023

ప్లస్ పాయింట్స్:

రవితేజ ఎంట్రీ

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బోర్ కొట్టించని కథా నేపథ్యం

ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్:

రన్ టైమ్

అక్కడక్కడా సాగదీతగా అనిపించే సీన్స్

ఆకట్టుకోని గ్రాఫిక్స్

అనవసరమైన లవ్ ట్రాక్

చివరిగా.. మాస్ మూవీ లవర్స్ అందరికీ ఈ మూవీ అద్భుతంగా నచ్చుతుంది. రవితేజ ఫాన్స్ కి ఇది మంచి దసరా ఫీస్ట్ అని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×