BigTV English

Rameez Raja: పాక్ ఇలా ఓడిపోవడానికి భారత్ కారణం: రమీజ్ రాజా

Rameez Raja: పాక్ ఇలా ఓడిపోవడానికి భారత్ కారణం: రమీజ్ రాజా

Senior cricketer Rameez Raja intresting comments in pakistan defeat : తుమ్మినా, దగ్గినా.. ఇలా ఎక్కడేం జరిగినా..అందుక్కారణం భారత్ అనడం పాకిస్తాన్ కు పరిపాటిగా మారింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఓటమి పాలు కావడంతో అక్కడ సీనియర్లు పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వారిలో ముఖ్యంగా సీనియర్ క్రికెటర్ రమీజ్ రాజా మాట్లాడుతూ పాక్ ఇలా ఓడిపోవడానికి కారణం.. భారత్ అని అన్నాడు. ఒక్కసారి ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.


ఈ మధ్య కాలంలో ప్రపంచకప్ లు, ఆసియా కప్ ఇలా ఎక్కడ చూసినా భారత్ చేతిలో పాక్ ఓటమి పాలవుతోంది. అలా ఓడినప్పుడు జట్టుని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో జట్టులో అందరిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతోంది. పాక్ లో అడుగుపెట్టడానికే వారు భయపడుతున్నారని అన్నాడు.

అలా మొదలైన ఓటమి భయం ఇప్పుడు పెరిగి, పెరిగి పెద్దదైంది. చివరికి ప్రతీ చిన్న జట్టు చేతిలో పరాజయం పాలవుతోందని రమీజ్ రాజా ఉద్ఘాటించాడు. దీనంతటికి కారణం ముమ్మాటికి భారత్ అని తేల్చిచెప్పాడు.


మరో పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ మా జట్టు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిదని అన్నాడు. ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో వారు నవ్వుతూ కనిపించారు. అంటే మ్యాచ్ ని ఎంత తేలికగా తీసుకున్నారనేది అర్థమవుతోందని అన్నాడు.

Also Read: అంతా నీవల్లే: కోచ్ పై పాక్ కెప్టెన్ ఆగ్రహం

నిజానికి వారినెవరూ ఏమీ అనరనే ధైర్యం ఉండటం వల్లే, వారు అంత అధ్వానంగా ఆడుతున్నారని విమర్శించాడు. ఒక క్లబ్ క్రికెట్ కన్నా చెత్తగా పాక్ టీమ్ ఆడిందని దుయ్యబట్టాడు. ఎవ్వరిలో కూడా  గెలవాలనే తపన లేదని, ఒక్క రిజ్వాన్ మాత్రం మొండిగా ఆడుతున్నాడని తెలిపాడు. అసలు ఈ జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు.

అయితే పాక్ కన్నా వంద రెట్లు మెరుగ్గా ఆడిన బంగ్లాదేశ్ ని అభినందించకుండా ఉండలేమని, ఎందుకంటే వారి దేశంలో అన్ని అల్లర్లు జరుగుతుంటే, అవన్నీ మనసులో పెట్టుకుని మరి గెలవడం నిజంగా గొప్పవిషయమని అన్నాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×