BigTV English

PAK VS BAN: అంతా నీవల్లే: కోచ్ పై పాక్ కెప్టెన్ ఆగ్రహం

PAK VS BAN: అంతా నీవల్లే: కోచ్ పై పాక్ కెప్టెన్ ఆగ్రహం

అనంతరం పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా 146 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.  దీంతో బంగ్లాదేశ్ టార్గెట్ కేవలం 30 పరుగులే అయ్యాయి. అలా చివరి రోజు రెండో సెషన్ లో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఆడుతూ పాడుతూ 30 పరుగులు చేసి తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది.

ఓటమి అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లో తీవ్ర కల్లోలం మొదలైంది. ఆ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ , కోచ్ గెలిస్పీ మధ్య వాగ్వాదం జరిగినట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోచ్ పై.. కెప్టెన్ మసూద్ అరుస్తున్నట్లుగా అందులో కనిపించింది. అంతా నీవల్లే జరిగింది, చెత్త ప్లానింగ్ అన్నట్టు కేకలు వేస్తున్నట్టుగా ఉందని నెటిజన్లు అప్పుడే కథలు అల్లేస్తున్నారు.


కోచ్, కెప్టెన్ మధ్య ఎందుకు ఘర్షణ మొదలైందనడానికి స్పష్టమైన కారణాలు మాత్రం తెలియ రాలేదు. కానీ పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో గత కొన్ని నెలలుగా తరచూ ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఆటగాళ్ల మధ్య విభేదాలు, కోచ్‌తో గొడవలు, మైదానంలో పేలవమైన ప్రదర్శనలతో ఇంటా బయటా వారు విమర్శల పాలవుతున్నారు.

ఈ పరిస్థితుల్లో పిల్లి మీద ఎలక, ఎలక మీది పిల్లిలా పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రవర్తన మారిందని అంటున్నారు. అంతేకాదు వెస్టిండీస్ జట్టు తరహాలోనే పాకిస్తాన్ కూడా ఆ వైభవాన్నికోల్పోతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×