Shadab Khan: పాకిస్తాన్ క్రికెట్ లో ఇప్పుడు ఓ అంశంపై తీవ్ర చర్చ జరుగుతుంది. అదేంటంటే పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్లు.. మహిళ నటులకు పదేపదే సందేశాలు పంపుతున్నారా..? అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ఇంటర్వ్యూలో ఓ మహిళ అభిమాని నుంచి షాదాబ్ కి ఈ ప్రశ్న ఎదురైంది.
Also Read: Weirdest Run-out: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. వింత రనౌట్.. ఏకంగా హెల్మెట్‌తోనే !
ఇటీవల పాకిస్తాన్ టిక్ టాక్ స్టార్ షాతాజ్ ఖాన్, షాదాబ్ ఖాన్ తో వాట్సప్ లో సంభాషించినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఆమెని షాదాబ్ పెళ్లికి ప్రపోజ్ చేశాడని తెలిపింది. అయితే షాదాబ్ ఇప్పటికే మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తక్ కుమార్తె మలైకాతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షాతాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె అడిగిన ఈ ప్రశ్నకు షాదాబ్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో కూడా పలువురు నటిమణులు తమకు పాక్ క్రికెటర్ల నుంచి మెసేజ్ లు వచ్చాయని పేర్కొన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా టిక్ టాకర్ షాతాజ్ ఖాన్.. ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే.. షాదాబ్ తనతో వాట్సప్ కాంటాక్ట్ లో ఉన్నాడని, తనని పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన తీసుకువచ్చాడని షాతాజ్ తెలిపింది.
ఈ విషయం గురించి తాజాగా “హస్నా మన హై” అనే టీవీ షోలో షాదాబ్ స్పందిస్తూ.. క్రికెటర్లు సందేశాలు పంపిస్తే అందులో తప్పేముంది..? ఒకరికి సందేశం పంపడం ఓపెన్ కమ్యూనికేషన్ లో భాగం. ఒకవేళ ఎవరైనా ఆ సందేశాలను అంగీకరించకపోతే.. వారు బ్లాక్ చేసే అవకాశం ఉంది. కేవలం క్రికెటర్లు మాత్రమే కాదు, నటీనటులు కూడా స్పందిస్తారు. వారికి కూడా ఆసక్తి ఉంటుంది. ఒకవేళ ఆ సందేశాలకు బదిలివ్వకుంటే ఇంకోసారి ఎవరూ మెసేజ్ చేసే సాహసం చేయరు.
వారు బదులిస్తున్నారు కాబట్టే.. వారికి కూడా ఎదుటివారి పట్ల ఆసక్తి ఉన్నట్లు అనుకోవాలి. కొంతమంది నటీమణులు ఈ విషయాల గురించి ఇటీవల చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను కూడా వారి వీడియోలు చూశాను. కానీ ఇందులో వారు చెప్పే ప్రతి విషయం నిజం కావాలని లేదు. కొన్ని కొన్ని సార్లు చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసి చూపిస్తారు. అలాంటి వాటివల్ల జుట్టుపై పెద్దగా ప్రభావం పడదు.
Also Read: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట !
కానీ జట్టులో ఏ సభ్యుడు మెసేజ్ పంపించాడన్న విజయం పై చర్చ జరుగుతుంది. కొంతమంది నటీమణులు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు జరుగుతున్న సమయంలో వీటి గురించి మాట్లాడడం ద్వారా ఫేమస్ కావాలని అనుకుంటారు. దీనిని పెద్దగా మార్చడం సరైనది కాదు” అన్నాడు.
Pakistani cricketer Shadab Khan dismissed TikToker Shahtaj Khan's relationship claims, suggesting such allegations are attention-seeking tactics.
Read more: https://t.co/Pe7i49tr6m#ThePakistan pic.twitter.com/Vo3vcJB4kf
— The Pakistan (@thepakistan2021) January 29, 2025