Satyam On Bjp: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై దుమ్మెత్తి పోశారు. కిషన్‌రెడ్డి ఐదేళ్లు కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? అంటూ ప్రశ్నించారు. మీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీ ఎదిగిందా? బండి సంజయ్ పుణ్యమాని పార్టీలో ఊపు వచ్చిందన్నారు.
అంబేద్కర్ పాలన సాగుతుందని, ఆయన నియమాలు పాటిస్తుందని బీజేపీ మాటలు చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. మూసి ప్రాంతవాసులు ఓట్లేస్తే గెలిసినవారు, మూవీ వాసన నుండి ప్రజలను బయట తీసుకురాలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఇంత ఆర్థిక ప్రగతి సాధించింది కేవలం రాజీవ్‌గాంధీ ఆలోచనతోనేనని అన్నారు.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం విధానం వల్ల మోదీ ఇప్పుడు ప్రశాంతంగా పాలన సాగిస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో అన్నిరకాల ప్రజలు ఉండాలని చెబుతూనే గద్దర్ గురించి బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. అంబేద్కర్, గద్దర్, గాంధీ.. అందరిని అవమానించేలా నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, సంజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే దేశ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మనసులోని మాట బయటపెట్టారు. అటు బీఆర్ఎస్ నేతలపైనా విరుచుకుపడ్డారు సత్యం. ప్యాలస్‌లో కూర్చుని కమాండ్ కంట్రోల్‌లో సమావేశాలు పెడుతున్నారని హరీష్‌రావు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. గడిచిన పదేళ్లు ప్రగతి భవన్‌లో ఎవరూ లోపలికి వెళ్లే అవకాశం లేదన్నారు.
ALSO READ: గాంధీ వర్ధంతి.. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్ నివాళులు
సీఎం రేవంత్‌రెడ్డి అప్పుడు, ఇప్పుడు అదే ఇల్లన్నారు. మీకు మాదిరిగా వందల ఎకరాల భూములు అమ్మలేదని, ఇలాంటి మాట్లలు చెప్పడానికి హరీష్‌రావుకి సిగ్గుండాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ పాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ చేస్తున్న ధర్నాలు చూసి ప్రజలు నవ్వుతున్నారని తెలిపారు.