BigTV English

Shakib Al Hasan : అందుకేనా? షకీబ్ అలా చేసింది?

Shakib Al Hasan : అందుకేనా? షకీబ్ అలా చేసింది?
 Shakib Al Hasan

Shakib Al Hasan : అందరూ షకీబ్ చేసిన టైమ్డ్ అవుట్ పైనే చర్చించుకుంటున్నారు. అయితే తనెందుకిలా చేశాడన్నది ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పటికే సెమీస్ దారులు మూసుకుపోయి ఇంటి బాట పట్టాల్సిన జట్టు, ఏదో ఒక్క మ్యాచ్ లో గెలవడం వల్ల బంగ్లాదేశ్ కి ఒరిగిందేమిటి? అనేది ఇక్కడ పెద్ద తచర్చగా మారింది.


మరోవైపు టైమ్డ్ అవుట్ అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ కి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ప్రతిష్టాత్మకరంగా మారింది. సెమీస్ బెర్త్ పోతేపోయింది..కనీసం 8వ స్థానంలోనైనా ఉండాలని భావించాడు. అలా చేయాలంటే ఈ మ్యాచ్ లో గెలవక తప్పని స్థితి ఉంది. లేదంటే అదో పెద్ద తలనొప్పిగా వ్యవహారం మారుతుంది.

ఎందుకంటే పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫికి అర్హత సాధించాలంటే కనీసం టాప్-8లో అయినా ఉండాలి. ఉంటే వీళ్లు నేరుగా ఆ ట్రోఫీకి అర్హత సాధిస్తారు. లేదంటే మళ్లీ క్వాలిఫయింగ్ మ్యాచ్ లు ఆడాలి. మళ్లీ ఎందుకా దౌర్భాగ్యమని అనుకున్నారో ఏమో తెలీదు.


శ్రీలంకతో చావోరేవో అన్నట్టు ఆడారు. మరోవైపు శ్రీలంకది అదే పరిస్థితి. నిజంగా మాథ్యూస్ కి అలా జరిగి ఉండకపోతే తను వచ్చి స్పీడుగా 20 లేదా 30 పరుగులు చేస్తే, నిజంగానే బంగ్లాదేశ్ ఇరకాటంలో పడేది.

 ఎందుకంటే శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 41.1 ఓవర్ లోనే బంగ్లాదేశ్ చేధించింది గానీ, అప్పటికి 6 వికెట్లు కోల్పోయింది. ఇక మిగిలిన వారందరూ టెయిల్ ఎండర్స్. నమ్మకాలు తక్కువ. బహుశా మ్యాచ్ టెన్షన్ లో పడేది. వస్తే వచ్చిందిలే చెత్త పేరు అనుకున్న బంగ్లా కెప్టెన్…చివరికి అలా చేశాడని కొందరంటున్నారు.

చాలామంది అంటున్నారు…అది ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి గ్రౌండ్ లోకి వెళ్లాక ఏ చిన్నఅవకాశాన్ని వదిలిపెట్టకూడదని చెబుతున్నారు. ఎంతైనా తమ్ముడు తమ్ముడే కదా…అంటున్నారు. మరోవైపు శ్రీలంకది అదే పరిస్థితి. తను కూడా కనీసం టాప్ 8లో ఉండాలి. వారి బాధ వారిది, వీరి బాధ వీరిది…మొత్తానికి  వన్డే ప్రపంచకప్ 2023లో జనానికి మాత్రం మంచి మసాలా దొరికింది. అందరిలో టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయింది.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×