BigTV English

Shami : బంగ్లా టూర్ కు షమీ దూరం.. జట్టులో ఆ స్పీడ్ స్టార్ కు చోటు..

Shami : బంగ్లా టూర్ కు షమీ దూరం.. జట్టులో ఆ స్పీడ్ స్టార్ కు చోటు..

Shami : భారత్ పేసర్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే జస్ ప్రీత్ బూమ్రా టీ20 వరల్డ్ కప్ కు , న్యూజిలాండ్ టూర్ గా దూరమయ్యాడు. ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. అంతకుముందు కూడా గాయాలతో చాలా సిరీస్ లకు బుమ్రా అందుబాటులో లేడు. తాజాగా మరో పేసర్ షమీ గాయంతో బంగ్లా టూర్ కు దూరమయ్యాడు. దీంతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది.


బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. భుజం గాయంతో షమీ ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. షమీ స్థానంలో యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు జట్టులో చోటు కల్పించారు. బంగ్లాతో వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన ట్రైనింగ్‌ సెషన్‌లో షమీకి గాయమైంది. అతడు ప్రస్తుతం ఎన్‌సీఏ పర్యవేక్షణలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లే టీమ్‌తో అతడు వెళ్లలేదని బీసీసీఐ ప్రకటించింది.

వన్డే సిరీస్‌ తర్వాత డిసెంబర్ 14 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది. టెస్ట్ సిరీస్ కు కూడా షమీ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్‌లో ఓవల్‌లో జరగబోయే ప్రపంచకప్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ రేసులో ఉండాలంటే.. టీమిండియా ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిన అవసరం ఉంది. బంగ్లాతో టెస్ట్ మ్యాచ్ లకు షమీ కూడా దూరం కావడంతో భారత్ బౌలింగ్ భారం యువపేసర్ల పడింది. వారు బంగ్లాదేశ్ టూర్ లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇక బంగ్లా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.


బంగ్లాతో వన్డేలకు భారత్ జట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైఎస్‌ కెప్టెన్‌), ధావన్‌, కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), షాబాజ్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×