Criminal Franchise: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా… జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన కారణంగా… అందరూ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టార్గెట్ చేస్తున్నారు. వెంటనే విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కారణంగానే… చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారని సోషల్ మీడియాలో కూడా వార్తలు తెగ వైరల్ చేస్తున్నారు. ఒకే ఒక్క టైటిల్ కోసం 11 మందిని పొట్టన పెట్టుకున్నారు కదరా అంటూ మండిపడుతున్నారు.
Also Read: Virat – Bengaluru Stampede: తొక్కిసలాట వెనుక కోహ్లీ కుట్రలు.. ఆ ఇద్దరి కోసం 11 మంది ప్రాణాలు బలి !
విరాట్ కోహ్లీని అరెస్టు చేయాల్సిందే!
చిన్నస్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి బాగా ఒత్తిడి వచ్చిందట. కచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని బెంగళూరు పోలీసులను రిక్వెస్ట్ చేశారట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోతాడని… అది కూడా గురువారమే ఆయన వెళ్తాడని పోలీసులకు సమాచారం ఇచ్చారట. ఆ లోపే అంటే బుధవారం రోజున ఖచ్చితంగా పరేడ్ నిర్వహించాల్సిందేన అంటూ… బెంగళూరు పోలీసులకు రాజకీయ నాయకుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేయించారట. కర్ణాటక ప్రభుత్వం లోని కొంతమంది రాజకీయ నాయకులు రంగంలోకి దిగడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరేడ్ కు పర్మిషన్ ఇచ్చారట బెంగళూరు పోలీసులు. అది కూడా బలవంతంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక్కడే పెద్ద తప్పిదం జరిగింది. భారీ సంఖ్యలో పోలీసులు లేకపోయినా హడావిడిగా పర్మిషన్ ఇచ్చారట
బెంగళూరు పోలీసులు. స్టేడియం దగ్గర 5,000 మంది బందోబస్తును ఏర్పాటు చేసింది కర్ణాటక పోలీస్ శాఖ. 30 నుంచి 50 వేల మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వస్తారు అనుకుంటే… ఆ సంఖ్య మూడు లక్షలకు పెరిగింది. దీంతో చిన్న స్వామి స్టేడియం 19వ గేట్ దగ్గర… ఉద్రిక్తత వాతావరణం నెలకొని తొక్కిసలాట జరిగింది. దీంతో 11 మంది మరణించారు.
విరాట్ కోహ్లీ కి ఖైదీ జెర్సీ
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మొన్న బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో కొన్ని జెర్సీలు తయారుచేసి బెంగళూరు అభిమానులు రచ్చ చేశారు. మహేంద్రసింగ్ ధోని ఒక ఖైదీ అని… మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాన్ చేయించాడని ప్రచారం చేశారు. ఇక వచ్చే సంవత్సరం బెంగళూరు జట్టు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోనుంది. చెన్నై చపాతి స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగితే కచ్చితంగా… విరాట్ కోహ్లీకి ఖైదీ జెర్సీ వేయాలని చెన్నై అభిమానులు రచ్చ చేసే ఛాన్సులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అంతే కాదు కొంతమంది ఖైదీ జెర్సీ నెంబర్ 18 పేరుతో… కొన్ని ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి ఆ జెర్సీ ని తొడగాల్సిందేనని… డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Karnataka CM: RCBకి బిగ్ షాక్.. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయండి.. సీఎం ఆదేశాలు
Never Forget, Never Forgive💔
SHAME ON RCB#ArrestKohli pic.twitter.com/2VjNElKUH4
— Honest Kohli Fan™💚❤️ (@KingEra_18) June 5, 2025
Next year at Chepauk 👍 pic.twitter.com/ahc6exgrdO
— ` (@WorshipDhoni) June 5, 2025