BigTV English
Advertisement

Suriya: వాడివాసల్ నుంచి తప్పుకున్న సూర్య.. కారణం ఏంటంటే ?

Suriya: వాడివాసల్ నుంచి తప్పుకున్న సూర్య.. కారణం ఏంటంటే ?

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా పాన్ ఇండియా లెవెల్ లో ఒక మంచి హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది కంగువ సినిమాతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.  ఇక ఈ సినిమా కోసం సూర్య చేసిన ప్రమోషన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలందర్నీ కలిసి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మార్చాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ఇంత హెవీగా ప్రమోషన్స్ చేయడంతో ఎంతో హైప్ తెచ్చుకున్న కంగువ నవంబర్ 14న రిలీజ్ అయి భారీ పరాజయాన్ని అందుకుంది.


 

కంగువ ప్లాప్ తర్వాత సూర్య ఈ ఏడాది రెట్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అయినా భారీ విజయాన్ని అందుకుంటుందని సూర్య నమ్మాడు. కానీ ఈసారి కూడా అతనికి లక్ కలిసి రాలేదు. కోలీవుడ్ లో సూర్య ఫ్యాన్స్ రెట్రోను ఆదరించినా  తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమా బాగాలేదని పెదవి విరిచారు. చివరికి నెట్ ఫ్లిక్స్ లో కూడా రెట్రో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.


 

ఇక దీంతో సూర్య తమిళ సినిమాలను పక్కనపెట్టి తెలుగు పైనే  ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య.. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక  ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సూర్యకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్  చేస్తుంది. సూర్య కెరీర్లో నే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం  వాడివాసల్.

 

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో సూర్య వాడివాసల్ ను ప్రకటించాడు. మూడేళ్ళుగా వెట్రి మారన్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. అయితే మూడేళ్లు అయినా కూడా బౌండ్ స్క్రిప్ట్ ను తీసుకురాలేకపోయాడు. దీంతో ఓపిక నశించిన సూర్య.. వాడివాసల్ నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో  వార్త వైరల్ అవుతోంది. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య తండ్రీకొడుకులుగా నటించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాపై సూర్యతో పాటు అభిమానులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.  కానీ, సూర్య తప్పుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు.

 

ఇక వెట్రిమారన్ సైతం తన తప్పును ఒప్పుకొని.. సూర్య తప్పుకున్నా కూడా ఏమి మాట్లాడలేదని తెలుస్తోంది.  ప్రస్తుతం వాడివాసల్ ను పక్కన పెట్టి అయన కూడా వేరే సినిమాతో బిజీగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఈ కథ ఏ స్టార్ హీరో వద్దకు వెళ్తుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×