CSK Fans Trolls Anirudh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 వేలం ( Indian Premier League 2027 Auction) దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రేడ్ ప్రక్రియ జోరు అందుకుంది. ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు ట్రేడింగ్ ద్వారా జట్లు మారిపోయారు. లేటెస్ట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ (sunrisers hyderabad), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్ల మధ్య భారీ ట్రేడ్ డీలింగ్ జరిగింది. ఈ క్రమంలో రియామ్ లివింగ్ స్టోన్ ( Liam Livingstone), జాక్ ఎడ్వర్డ్స్ ను (Jack Edwards) చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇచ్చిన హైదరాబాద్… ఇద్దరి స్థానంలో బలమైన ఆటగాళ్లు ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed), నాథన్ ఎల్లీస్ ను (Nathan Ellis) తీసుకుంది. అ ఈ మేరకు రెండు జట్లు అధికారికంగా ప్రకటించాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఈ డీలింగ్ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ విమర్శల పాలు అవుతున్నాడు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు టార్గెట్ చేసి.. ట్రోల్స్ చేస్తున్నారు. కాబోయే పెళ్ళాం కావ్య పాప కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును బలి చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న కీలక ప్లేయర్లను హైదరాబాద్ జట్టులోకి పంపిస్తున్నాడని పోస్టులు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాన్ని బురిడీ కొట్టించి… ఈ నలుగురు ప్లేయర్ల ట్రేడింగ్ కు కారణమయ్యాడని ఆగ్రహిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వెన్నుపోటు పొడిచి తన భార్యకు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును బలంగా చేసుకుంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. అందుకే బలమైన ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లీస్ (Nathan Ellis) ఇద్దరు హైదరాబాద్ జట్టులకు వెళ్లారని విమర్శలు చేస్తున్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ వివాహం మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 10వ తేదీన జరగనుంది. గ్రీస్ దేశంలో కొంత మంది సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి జరిపిస్తున్నారు. కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. నవంబర్ 21వ తేదీన చెన్నైలో కావ్య పాప, అనిరుధ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుక నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.