Shoaib Akhtar On IND VS PAK: ఆసియా క్రీడాలు 2026 టోర్నమెంట్ లో (2026 Asian Games tournament) భాగంగా టీమిండియాతో పాకిస్తాన్ తలపడితే (Shoaib Akhtar On IND VS PAK), మా వాళ్లు చిత్తుగా ఓడిపోతారని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) వివాదాస్పద స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం భారత జట్టు అత్యంత బలంగా ఉందని… ఆ జట్టును చూస్తే పాకిస్తాన్ క్రికెటర్లు ప్యాంట్లు తడుపుకుంటారని బాంబు పేల్చారు. ఆసియా క్రీడలలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య అసలు మ్యాచ్ జరగకపోవడం బెటర్ అన్నారు. జరిగితే మాత్రం… పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పరాభవం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2026 ఆసియా క్రీడలలో ఇండియా ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ జట్ల మధ్య మ్యాచ్ దాదాపు ఉండకపోవచ్చు. ఇప్పటికే ఈ ఆసియా క్రీడల నేపథ్యంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఇండియా అలాగే పాకిస్తాన్ వేరు వేరు గ్రూపుల్లో ఉన్నాయి. ఇవాళ సెమీ ఫైనల్స్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు మరో సెమీ ఫైనల్ లో ఇండియా ఉమెన్స్ వర్సెస్ బంగ్లాదేశ్ ఉమెన్స్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో, ఇండియా విజయం సాధించింది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీన ఫైనల్ లో శ్రీలంకతో స్వర్ణ పతకం కోసం టీమిండియా తలపడుతుంది. అయితే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఉంటే టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేది. కానీ ఆ మ్యాచ్ మిస్ అయిందని చెప్పవచ్చు. ఒకవేళ ఫైనాల్స్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఉమెన్స్ ఓడిపోతే, మాత్రం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది. కాంస్య పతకం కోసం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇటు పురుషుల క్రికెట్ లో… ఇండియా, పాకిస్తాన్ జట్లు తమ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లలో గెలిచి సెమీ ఫైనల్స్ లేదా ఫైనల్స్ చేరితే అక్కడ తలపడతాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ టీం ఇండియాతో మ్యాచ్ జరిగితే మాత్రం పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. వాళ్లతో ఆడడం కంటే.. ఇప్పుడే బ్యాగులు సర్దుకొని ఇంటికి రావడం బెటర్ అన్నారు. అనవసరంగా మ్యాచ్ ఆడితే మాత్రం… దారుణంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోతుందని అంచనా వేశారు.