E-Paper
Advertisement

ఇండియ‌న్స్ కంటే, పాకిస్తాన్ వాళ్లకే దేశ భ‌క్తి ఎక్కువ‌ !

ఇండియ‌న్స్ కంటే, పాకిస్తాన్ వాళ్లకే దేశ భ‌క్తి ఎక్కువ‌ !
Advertisement

Harbhajan Singh praises Pakistan:  పాకిస్తాన్ అంటే భారతీయులకు అస్సలు పడదు. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్లను మెచ్చుకుంటూ టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్స్ కంటే పాకిస్తాన్ వాళ్లకు దేశభక్తి ఎక్కువ అంటూ బాంబు పేల్చారు. ఇజ్రాయెల్ విషయంలో ఈ విషయం స్పష్టమైందని తెలిపారు. కానీ ఇండియన్స్ శత్రుద్దేశం వస్తువులనే ఇప్పటికీ కొనుగోలు చేస్తూ, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీంతో హర్భజన్ సింగ్ (Harbhajan Singh ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇండియ‌న్స్ కంటే, పాకిస్తాన్ వాళ్లకే దేశ భ‌క్తి ఎక్కువ‌ !

ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… పాకిస్తాన్ కచ్చితంగా స్టాండ్ తీసుకుంది. పాలిస్తీనా భూభాగాలను అన్యాయంగా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుందని పాకిస్తాన్ వెల్లడిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులకు నిరసన కూడా తెలిపింది. పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభావం తెలుపుతూ… అన్ని వేదికలపై ఇజ్రాయెల్ ను దూరం కొట్టింది పాకిస్తాన్.

Advertisement

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

అంతర్జాతీయ క్రీడాలలో కూడా ఇజ్రాయెల్ ను అవమానించిన పాకిస్తాన్

46వ ఫీడె ప్రపంచ చెస్ ఒలంపియాడ్ టోర్నమెంట్లో పాకిస్తాన్ (Pakistan) వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య మొదటి రౌండులో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రత్యేకమైన స్టాండ్ తీసుకుని.. ఆ మ్యాచ్ బహిష్కరించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ కు మద్దతిస్తున్న అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించిన వస్తువులను కూడా పాకిస్తాన్ లో బ్యాన్ చేశారు. ఇలా అడుగడుగునా ఇజ్రాయెల్ పరువు తీస్తూనే ఉంది పాకిస్తాన్. ఇజ్రాయెల్ కు (Isreal) వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న పోరాటంపై హర్భజన్ సింగ్ తాజాగా స్పందించారు. దేశ భక్తి గురించి పాకిస్తాన్ వాళ్ల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

Advertisement

పాలస్తీనాకు అన్యాయం జరిగితే… ఇజ్రాయెల్ ను అడుగడుగునా పాకిస్తాన్ తొక్కేస్తోందని వివరించారు. అయితే ఇండియన్స్ మాత్రం… ఇప్పటికీ పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడుతూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. పహాల్గామ్ సంఘటనలో అంతమంది యాత్రికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు… అయినప్పటికీ పాకిస్తాన్ తో ఇండియన్స్ క్రికెట్ తో పాటు అన్ని క్రీడాలు ఆడుతున్నారని ఆగ్రహించారు. దేశభక్తి ఉంటే అసలు పాకిస్తాన్ తో ఏం మ్యాచ్ ఆడకూడదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ ( Pakistan) వాళ్లకు దేశ భక్తి ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు హర్భజన్ సింగ్. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా… పాకిస్తాన్ దేశాన్ని మెచ్చుకున్న హర్భజన్ సింగ్ పై ( Harbhajan Singh) సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

Related News

హర్మన్‌ప్రీత్ కౌర్ కు అస‌లు సిగ్గుందా? షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చావంటూ ట్రోల్స్‌

ఫ్లాట్ పిచ్ ల్లో సెంచ‌రీ చేయ‌డం మ‌గ‌త‌నం కాదు, ద‌మ్ముంటే బాబ‌ర్ లాగా ఆడాలి

టీమిండియా క్రికెటర్ల మెడ‌పై మోడీ స‌ర్కార్‌ క‌త్తి పెడుతోంది !

టీమిండియాలో సౌర‌వ్ గంగూలీని తిట్ట‌ని వాడు లేడు…సెహ్వాగ్ సంచ‌ల‌నం !

పాకిస్తాన్‌ జట్టులోనూ అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర బ్యాటర్ ఉంటే బాగుండు

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?

బీసీసీఐకి డ‌బ్బుల పొగ‌రెక్కువ‌…ఎవ‌రినైనా కొనేసి, టీమిండియా గెలిచేలా చేస్తుంది!

Big Stories

Advertisement
×