E-Paper
Advertisement

ఇంత దుర్మార్గమా? ఆసియా క‌ప్ ఇవ్వ‌కుండా న‌ఖ్వీని జై షానే అడ్డుకున్నాడు

ఇంత దుర్మార్గమా? ఆసియా క‌ప్ ఇవ్వ‌కుండా న‌ఖ్వీని జై షానే అడ్డుకున్నాడు
Advertisement

Shahid Afridi On U19 Asia Cup 2026:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 tournament) విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఏషియ‌న్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మొహ్సిన్ న‌ఖ్వీ ట్రోఫీ ఇవ్వాల్సి వస్తుందని అతడిని ఐసీసీ బాస్ జై షా కుట్రలు చేసి… మ్యాచ్ కు హాజరు కాకుండా చేశాడని బాంబు పేల్చాడు. ఇప్పటికే రెండు ట్రోఫీలు తీసుకోకుండా వెళ్లిన టీమిండియా.. మూడో ట్రోఫీ కూడా కోల్పోతుందనే భయం జై షాకు పట్టుకుందని ఆగ్రహించాడు.

ఆసియా క‌ప్ ఇవ్వ‌కుండా న‌ఖ్వీని జై షానే అడ్డుకున్నాడు

అందుకే తెలివిగా మొహ్సిన్ న‌ఖ్వీ హాజరు కాకూడదని వెనుక నుంచి కథ నడిపించినట్టు ఆరోపించాడు. శనివారం రోజున ఐసీసీ ఉన్నత స్థాయి సమావేశం పేరుతో డ్రామాలు ఆడాడని ఫైర్ అయ్యాడు. ఇందులో భాగంగానే ఒమెన్ కు వెళ్లాల్సిన మొహ్సీన్ న‌ఖ్వీ లండన్ కు వెళ్లాల్సి వచ్చిందని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ గ్యాప్ లో టీమిండియా జట్టు గెలిచి ట్రోఫీ ఎత్తుకెళ్లిందని ఆగ్రహించాడు. దీంతో షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కానీ, న‌ఖ్వీ వ‌చ్చింటే, అంద‌రి తాట తీసేవాడని ఆగ్ర‌హించాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

మొహ్సిన్ నఖ్వీ స్థానంలో ట్రోఫీ ఇచ్చింది ఎవరంటే

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆరోపించినట్టుగానే… మొహ్సిన్ నఖ్వీ శనివారం లండన్ వెళ్లినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఐసీసీ స్పెష‌ల్ మీటింగ్ పేరు ఆసియా కప్ అండర్-19 ఫైనల్ మ్యాచ్ కు మొహ్సిన్ నఖ్వీ హాజరు కావడంతో మరో వ్యక్తి టీమిండియాకు ట్రోఫీని అందించాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతినిధి హోదాలో షేక్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ అనే వ్యక్తి చేతుల మీదుగా టీమిండియా ట్రోఫీని అందుకుంది.

Advertisement

ఇక ట్రోఫీ తీసుకున్న తర్వాత టీమిండియా క్రికెటర్లు స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. కొందరు హార్దిక్ పాండ్యా తరహాలో ట్రోఫీని మైదానంలో పెట్టి ఫోటోలు దిగారు. ఆ త‌ర్వాత అండర్ 19 టీమ్ ఇండియా సభ్యులందరూ అభిషేక్ శర్మ తరహాలో ఓం నమో: శివాయ‌ స్మరణం చేస్తూ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. అటు అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ విజేతగా టీమిండియా గెలిచిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. యంగ్ ఇండియాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించినందుకు మెచ్చుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఊపుతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చాడు. కాగా… ఇండియాకు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అండర్ 19 ప్లేయర్లకు ప్రత్యేక విందు కూడా ఉండనున్నట్టు సమాచారం.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

 

Related News

భార‌త క్రికెట‌ర్ల‌ మెద‌ళ్ల‌లో విషం నిప్పులుతున్నారు..అందుకే మృగాళ్ల‌లాగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు

అండర్ 19 ఆసియా కప్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ ఎందుకు ఇవ్వలేదంటే?

హంజాపై టీమిండియా ప్లేయర్ దాడి? స్టేడియం నుంచి పారిపోయిన పాక్ ఆటగాళ్లు

పాక్ పై టీమిండియా ‘దండ్రయాత్ర’..9వ సారి ఆసియా కప్ మనదే

“అబ్ స్ట్రక్టింగ్ ది ఫీల్డ్” పేరుతో పాకిస్తాన్ దొంగాట‌..ప‌గ‌ల‌బడి నవ్విన‌ ఆర్య‌వీర్ సెహ్వాగ్

బాబ‌ర్ ఆజం బ్యాటింగ్ చేస్తుండ‌గా…క‌ట్ డ్రాయ‌ర్లు, బ‌నియ‌న్ల‌, నైటీల విజువ‌ల్స్‌

న్యూజిలాండ్ పైనే చేతులెత్తేశారు…రోహిత్, కోహ్లీల‌ను న‌మ్ముకుంటే 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ ముంచేస్తారు

Big Stories

Advertisement
×