Rent a Friend for Just Rs 300: ఒంటరితనం.. ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ముఖ్యంగా సిటీల్లో ఉద్యోగాలు, చదువులు, కొత్త జీవితం కోసం వెళ్లేవారికి పరిచయాలు ఉన్నా.. మనసు విప్పి మాట్లాడుకునే వ్యక్తి లేకపోవడం కామన్ అయ్యింది. ఇలాంటి వారికి స్నేహం, తోడు అందించేలా కొన్ని ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి ‘RentAFriend’ కాన్సెప్ట్. ఫ్రెండ్ ను అద్దెకు తీసుకోవడం కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. అయితే, దీని ఉద్దేశం డేటింగ్, రొమాన్స్ కాదు. కేవలం స్నేహం, మాట్లాడుకోవడం, కలిసి సమయం గడపడం లాంటి ప్లాటోనిక్ కంపానియన్‌షిప్‌నే అందించడం.
RentAFriend.in అనేది స్నేహితుడిగా సమయం కేటాయించే వ్యక్తులను, అలాంటి తోడు కావాలనుకునే వారిని కనెక్ట్ చేసే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తమ ప్రొఫైల్స్, ఇంట్రెస్ట్ లు, హాబీలు లాంటి వివరాలను ఎంటర్ చేసుకోవచ్చు. వారిని కాంటాక్ట్ కావాలనుకునే వినియోగదారులు ముందుగా ప్రొఫైల్స్ చూసి తమకు సరిపోయే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఒకరిని సంప్రదించడం, సర్వీస్ తీసుకోవడానికి ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన నిబంధనలు పాటించడం, ఫీజులు చెల్లించడం చేయాలి. ఇందులో సర్వీస్ పొందాలంటే రూ. 300తో సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే, మూడు నెలల వరకు సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అయితే, రెంట్ కు తీసుకునే ఫ్రెండ్ కు గంటల చొప్పున పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
దీనికి కారణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొత్త నగరానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రదేశాలు చూపించడానికి ఒక లోకల్ వ్యక్తి కావాలనుకునేవారు ఉండొచ్చు. అలాగే ఒంటరిగా సినిమా, రెస్టారెంట్, ఈవెంట్‌కు వెళ్లడం ఇష్టం లేనివారు కూడా ఇలాంటి స్నేహాన్ని కోరుకోవచ్చు. కొంతమంది కేవలం మాట్లాడుకోవడానికి, కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి లేదా తమకు నచ్చిన హాబీ, భాష లాంటి విషయాలు నేర్చుకోవడానికి కూడా కంపానియన్‌ను ఎంచుకోవచ్చు.
ఈ ప్లాట్ ఫామ్ లలో పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా తమను ‘Friend’గా ఎంటర్ చేసుకోవచ్చు. ఎవరైనా వారి ప్రొఫైల్‌ను ఎంచుకుని సమయం గడపడానికి సర్వీస్ తీసుకుంటే, నిర్ణయించిన రేటు ప్రకారం ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఎంత ఛార్జ్ చేయాలి? ఎలాంటి సర్వీసులు అందించాలి? ఎలాంటి వ్యక్తులను కలవాలి? లాంటి విషయాల్లో ప్లాట్ ఫామ్ నియమాలను పాటించడం అవసరం.
ఇక్కడే చాలామందికి సందేహం వస్తుంది. ‘RentAFriend’ పేరులో ‘Rent’ ఉండటంతో ఇది డేటింగ్ లేదంటే గర్ల్ ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ అద్దెకు తీసుకునే సర్వీస్ అనుకోవచ్చు. కానీ, ప్లాట్ ఫామ్ ఉద్దేశం ప్లాటోనిక్ ఫ్రెండ్‌షిప్‌గానే ఉంటుంది. అంటే స్నేహం, మాట్లాడుకోవడం, కలిసి సమయం గడపడం వంటి వాటికే పరిమితం.
తెలియని వ్యక్తిని ప్రత్యక్షంగా కలిసే సందర్భంలో జాగ్రత్త తప్పనిసరి. మొదటి మీటింగ్ ను పబ్లిక్ ప్లేస్‌లో ఉండేలా చూసుకోవడం మంచింది. వ్యక్తిగత వివరాలు, డబ్బు, ఇతర సున్నితమైన విషయాలను ఎదుటి వారితో వెంటనే షేర్ చేసుకోకపోవడం మంచిది. ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవడం అనే ఆలోచన వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ, దీని వెనుక ప్రధానంగా ఉన్నది మనుషులకు తోడు, స్నేహం అందించాలనే కాన్సెప్ట్. ఒంటరితనం పెరుగుతున్న సిటీ లైఫ్ స్టైల్ లో ఇలాంటి సర్వీసులు ఎందుకు ఆసక్తిని కలిగిస్తున్నాయో ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది.
Read Also: వామ్మో.. ఏకంగా అగ్నిపర్వతంలోనే ఇళ్లు కట్టేసుకున్నారు, పేలితే?