BigTV English

Shock to Brazil.. Croatia in semi-finals.. : బ్రెజిల్‌కు షాక్.. సెమీస్‌కు క్రొయేషియా..

Shock to Brazil.. Croatia in semi-finals.. : బ్రెజిల్‌కు షాక్.. సెమీస్‌కు క్రొయేషియా..

Shock to Brazil.. Croatia in semi-finals.. : సాంబా జట్టు కల చెదిరింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా చేతిలో ఓడిపోయి… టోర్నీ నుంచి నిష్క్రమించింది. విజయం ఖాయమనుకుని సంబరాలు చేసుకుంటున్న సమయంలో క్రొయేషియా అనూహ్యంగా గోల్ కొట్టడం… మ్యాచ్ షూటౌట్‌కు దారితీయడం… చివరికి అనూహ్య ఓటమి ఎదురుకావడంతో… బ్రెజిల్ ఆటగాళ్లు, అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.


మ్యాచ్ ఆరంభం నుంచే క్రొయేషియా గోల్ పోస్టుపై పదే పదే దాడి చేసింది… బ్రెజిల్. గోల్ కొట్టడమే లక్ష్యంగా ఎక్కువ షాట్లు ఆడింది. నెయ్‌మార్‌ సహా బ్రెజిల్‌ ఆటగాళ్లు బంతిని నెట్‌లోకి పంపేందుకు చాలా సార్లు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ క్రొయేషియా డిఫెన్స్‌ చాలా బలంగా నిలబడి బ్రెజిల్‌కు చెక్‌ పెట్టింది. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్‌… బ్రెజిల్ ప్రయత్నాలు అన్నింటినీ సమర్థంగా అడ్డుకున్నాడు. నిర్ణీత సమయం, ఇంజురీ టైంలో రెండు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లింది. కాసేపటికే నెయ్‌మార్‌ బ్రెజిల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 106వ నిమిషంలో క్రొయేషియా బాక్స్‌ చివర్లో బంతిని చేజిక్కించుకున్న నెయ్‌మార్‌.. చుట్టూ క్రొయేషియా డిఫెండర్లు ఉన్నా.. వారిని తప్పిస్తూ బంతిని ముందుకు తీసుకెళ్లాడు. నెయ్‌మార్‌ నుంచి బంతిని అందుకున్న పక్వెటా తిరిగి అతడికే పాస్‌ ఇవ్వడంతో.. నెట్‌కు సమీపంలోకి దూసుకెళ్లి నెయ్‌మార్‌ మెరుపు గోల్‌ కొట్టాడు. అంతే… బ్రెజిల్‌ మామూలుగా సంబరాలు చేసుకోలేదు. ఇక సెమీస్‌ బెర్తు ఖాయమైపోయిందని అటు ఆటగాళ్లు, అభిమానులు ఫిక్సైపోయారు. కానీ… ఆ ఆనందం పది నిమిషాలు కూడా నిలబడలేదు. గోల్ కొట్టాక బ్రెజిల్‌ డిఫెన్స్‌లో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీన్ని అనుకూలంగా మార్చుకుని 115వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు పెట్కోవిచ్‌ గోల్ కొట్టాడు. పెట్కోవిచ్‌ కొట్టిన షాట్ రీబౌండ్‌ అయి రాగా… దాన్ని ఓర్సిచ్‌ మళ్లీ అతనివైపే కొట్టాడు. ఈసారి పెట్కోవిచ్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్ పోస్టులోకి పంపాడు.

గోల్స్ 1-1తో సమం కావడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. క్రొయేషియా ఆటగాడు వ్లాసిచ్ తొలి ప్రయత్నంలో గోల్‌ కొట్టి జట్టును ఆధిక్యంలో నిలపగా… రోడ్రిగో విఫలమవడం బ్రెజిల్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. రోడ్రిగో నెట్‌ దిశగా కొట్టిన షాట్‌ను సరిగ్గా అంచనా వేసిన క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్‌… అద్భుత డైవ్‌తో ఆపేశాడు. రెండు, మూడో ప్రయత్నంలో ఇరు జట్లూ గోల్ కొట్టాయి. నాలుగో ప్రయత్నంలో ఓర్సిచ్‌ గోల్‌ కొట్టి క్రొయేషియాను 4-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బ్రెజిల్ ఆటగాడు మార్కినో కొట్టిన షాట్‌ ఎడమవైపు గోల్‌ బార్‌ను తాకి బయటికి వచ్చేయడంతో… ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆ జట్టు కథ ముగిసింది. గత వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన క్రొయేషియా… బ్రెజిల్‌కు గుండెకోత మిగిల్చి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×