BigTV English

Manu Bhaker: అమ్మాయి షూటింగులో అదరగొట్టింది.. ఫైనల్ కు చేరిన మనుబాకర్

Manu Bhaker: అమ్మాయి షూటింగులో అదరగొట్టింది.. ఫైనల్ కు చేరిన మనుబాకర్

Paris Olympics 2024 Manu Bhaker Qualifies for Women’s 10m air Pistol Final: ఒలింపిక్స్ లో అబ్బాయిలు నిరాశపరిచినా అమ్మాయి ఫైనల్ చేరి మెడల్ రేస్ లో నిలిచింది. ఇంతకీ తనెవరంటే మను బాకర్. పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ లో గురిపెట్టి కొట్టింది. మూడో స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించింది.


తొలిరోజు షూటింగులో పురుషులు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నిరాశపరిచారు. కానీ మనుబాకర్ మాత్రం 580.27 స్కోరుతో అదరగొట్టింది. అయితే మరో షూటర్ రిథమ్ సంగ్వాన్ 15వ స్థానానికి పడిపోయింది. అయితే టాప్ 8 లో ఉన్నవారు ఫైనల్ రౌండ్ కి వెళతారు. పురుషుల విభాగంలో సరబ్ జోత్ సింగ్ 9వ స్థానంలో పడిపోయాడు. లేదంటే తను కూడా అర్హత సాధించేవాడే. ఫైనల్ లోనే పతకానికి సంబంధించి అసలైన గేమ్ జరుగుతుంది. అలా టాప్ 3లో ఉన్నవారికి వరుసగా మూడు పతకాలు వస్తాయి.

మొత్తానికి 20 ఏళ్ల తర్వాత ఎయిర్ పిస్టల్ సింగిల్స్ లో ఫైనల్ చేరిన భారత షూటర్ గా మను బాకర్ రికార్డ్ స్రష్టించింది. జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ఫైనల్స్ ప్రారంభమవుతాయి.


Also Read: ఒలింపిక్స్ లో.. గురి తప్పిన షూటర్లు

ఇంతకీ 22 ఏళ్ల మనుబాకర్ హర్యానాకు చెందిన క్రీడాకారిణి. ఝజ్జర్ పట్టణంలో తను జన్మించింది. 2016లో తన 14వ ఏట రియో ఒలింపిక్స్ లో పాల్గొంది. 2017లో జాతీయ షూటింగ్ ఛాంపియన్ గా నిలిచింది. 2017లో ఆసియన్ జూనియర్ ఛాంపియన్ షిప్ సాధించింది.

ఒలింపిక్స్ లో ఫైనల్ కి చేరిన తనకి బలమైన ప్రత్యర్థులుగా హంగేరి దేశానికి చెందిన మేజర్ వెరొనికా 582.22 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే జిన్ 580.20 పాయంట్లతో రెండో స్థానంలో నిలిచింది. వీరి సరసన మను బాకర్ నిలిచింది. ఫైనల్ లో ఇలాగే ఆడితే కాంస్య పతకం గ్యారంటీ అంటున్నారు. లేదు రెండు రోజుల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసి ముందడుగు వేస్తే, ఏమైనా అద్భుతాలు జరగవచ్చునని అంటున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×