Manchu Mohan Babu On Prabhas : ఈనెల 27న విడుదల కానున్న ‘కనప్ప’ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ప్రముఖ నటుడు మోహన్‌బాబు కోరారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. సినిమా రంగంలో స్వయం కృషితో కష్టపడి పైకొచ్చాను. జీవితంలో భయం అనేది ఉండకూడదు. తప్పు చేయునప్పుడు ఎవరికీ భయపడకూడదు. నా విద్యాలయాల్లో విద్యార్థులకు అదే నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి అనేక మంది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు అయ్యారు. కన్నప్ప కోసం నా కుమారుడు ఆరేడేళ్లు కష్టపడ్డాడు.. ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు.
మోహన్ బాబు మాటల్లో ప్రభాస్
మా బావ ప్రభాస్. నేను ఎప్పుడూ తనని బావా బావా అని పిలుస్తూ ఉంటాను. అతను కూడా నన్ను బావ బావ అని పిలుస్తూ ఉంటాడు. నేను ప్రభాస్ కి ఫోన్ చేసి బావ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు. రేపు ఎల్లుండో రండి బావ అని నాతో చెప్పాడు. ఏమయ్యా నేను ఒక సినిమా చేస్తున్నాను, నువ్వు వరల్డ్ లో బెస్ట్ యాక్టర్ వి, దానిలో ఒక పాత్ర ఇంతసేపు ఉంటుంది నువ్వు చేయాలి. దానికి నువ్వు ఎస్ ఆర్ నో అని చెప్పాలి. అని మోహన్ బాబు ప్రభాస్ తో ఫోన్లో మాట్లాడారు. ఒకవేళ ఈ సినిమాకి నువ్వు నో చెప్పినా కూడా రేపు నేను నీ సినిమాలో ఖచ్చితంగా నటిస్తాను అంటూ తెలిపారు.దీనికి ప్రభాస్ స్పందిస్తూ, బావ నువ్వు దీనికి రావాలా నేను విష్ణు మాట్లాడుకుంటాం మీరు పెట్టేయండి అని ఫోన్లో చెప్పి ఒప్పుకున్నారు అని మోహన్ బాబు తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో వీరిద్దరూ కలిసి ఇదివరకే నటించిన విషయం తెలిసిందే.
స్టేజ్ పైన డైలాగులు
‘బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తలదించిన వాడు బాగుపడతాడు. ఎదురించిన వాడు వాగులో పడతాడు’ ‘నిన్న జరిగింది మిరిచిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వేయను.. రేపటి గురించి ఆలోచించను.. దటీజ్ రామన్న’ అంటూ మోహన్‌బాబు డైలాగ్‌లతో అభిమానులను అలరించారు. మంచు విష్ణు కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. మోహన్‌బాబు, (Mohan Babu) ప్రీతి ముకుందన్, శరత్‌కుమార్, ముకేశ్ రుషి, రఘుబాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, కాజల్, అక్షయ్‌కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మీద ఇంత మంది నటులు నటించడంతో కొంతమేరకు అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: Pawan Kalyan OG: ఓజి మేకర్స్ కు విముక్తి, మొత్తానికి రక్షించాడు