BigTV English

Shubman Gill and Avesh Khan: ఆ ఇద్దరూ ఇంటికి వచ్చేస్తున్నారు..

Shubman Gill and Avesh Khan: ఆ ఇద్దరూ ఇంటికి వచ్చేస్తున్నారు..

Gill And Avesh Khan Will be Sent Back Home After Ind vs Can Match T20 WC 2024:
టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లింది. అదే ఊఫులో సూపర్ 8 కి చేరింది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్.. రేపు ఫ్లోరిడా వేదికగా కెనడాతో జరగనుంది. అనంతరం టీమ్ ఇండియా సూపర్ 8 ఆడేందుకు వెస్టిండీస్ వెళ్లనుంది.


అయితే అక్కడ స్లో పిచ్ లు కావడం, స్పిన్ కు అవకాశం ఉండటంతో ప్రస్తుతం జట్టుతో పాటు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్న నలుగురిలో ఇద్దరిని ఇండియా పంపించనున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ ఇద్దరూ ఎవరంటే శుభ్ మన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ అని అంటున్నారు.

మిగిలిన ఇద్దరిలో రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం జట్టుతో కొనసాగనున్నట్టు తెలిసింది. టీమ్ ఇండియా ఛార్టెడ్ ఫ్లయిట్ లో ఫ్లోరిడాకు చేరుకున్నట్టు సమాచారం. కెనడా మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ ఇద్దరు భారత్ కి తిరిగి పయనం కానున్నట్టు తెలిసింది.


ఎందుకు గిల్ ని తిరిగి రప్పిస్తున్నారని అంటే, ప్రస్తుతం ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కొహ్లీ వస్తున్నారు. అందువల్ల ఓపెనర్ స్థానం గిల్ కి ఖాళీ లేదు. అలాగే రిజర్వ్ బెంచ్ లో యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ ఇద్దరూ ఉన్నారు. అందువల్ల గిల్ అవసరం దాదాపు లేకపోవచ్చుననే అంటున్నారు.

Also Read: సూపర్ 8కి చేరిపోయిన జట్లు ఇవే..!

అక్కడ వెస్టిండీస్ లో స్పిన్ కి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అదనపు పేసర్ తో అవసరం లేదు. ఆల్రడీ జట్టులో అర్షదీప్, బుమ్రా, సిరాజ్, హార్దిక్, శివమ్ దుబె వీళ్లందరూ పేస్, మీడియం పేస్ ఇలా వేర్వేరుగా ఉన్నారు. అందువల్ల ఆవేశ్ ఖాన్ అవసరం కూడా దాదాపు రాకపోవచ్చుననే భావనతో తనని కూడా తిరుగు ఫ్లయిట్ ఎక్కించనున్నారని అంటున్నారు.

అయితే హిట్టర్ రింకూ సింగ్, బ్యాకప్ పేసర్ గా ఖలీల్ అహ్మద్ ను మాత్రం టీమ్ ఇండియాతో పాటు కొనసాగించనున్నారని తెలిసింది. ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్ జట్లను ఓడించింది. రేపు కెనడాతో మ్యాచ్ జరగనుంది. అయితే ఫ్లోరిడాలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడ మ్యాచ్ జరుగుతుందనే గ్యారంటీ అయితే కనిపించడం లేదు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×