E-Paper
Advertisement

Shubman Gill: గిల్ హెల్త్ అప్డేట్‌..ప్ర‌యాణాలు చేస్తే ప్ర‌మాద‌మే..3 నెలలు రెస్ట్ !

Shubman Gill: గిల్ హెల్త్ అప్డేట్‌..ప్ర‌యాణాలు చేస్తే ప్ర‌మాద‌మే..3 నెలలు రెస్ట్ !
Advertisement

Shubman Gill:  టీమిండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill ) మెడనొప్పి బారిన పడ్డ సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే రెస్ట్ తీసుకుంటున్న శుభ్‌మ‌న్ గిల్ ఆరోగ్యం గురించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. మెడ నొప్పి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణాలు చేయకూడదని శుభ్‌మ‌న్ గిల్ కు డాక్టర్లు సూచనలు చేసినట్లు చెబుతున్నారు. అలా ట్రావెల్ చేస్తే మెడనొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉందట.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

శుభ్‌మ‌న్ గిల్ ఆరోగ్యం పై వైద్యుల కీలక ప్రకటన

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న శుభ్‌మ‌న్ గిల్ మెడ నొప్పి బారిన పడ్డాడు. బౌండరీ సాధించిన తర్వాత మెడ పట్టేయడంతో గిలగిలలాడిపోయాడు. దీంతో వెంటనే శుభ్‌మ‌న్ గిల్ ను ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు ఐసీయూలో కూడా ట్రీట్మెంట్ అందించారు వైద్యులు. ఇప్పుడిప్పుడే శుభ్‌మ‌న్ గిల్ కోలుకుంటున్న‌ట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే మెడ నొప్పితో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఈ నెల 22వ తేదీన జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో మూడు నెలల పాటు తీసుకోవాల్సిందేనని వైద్యులు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ మెడ నొప్పితో ప్రయాణాలు చేయకూడదని మెడికల్ టీం సూచనలు చేసినట్లు క్రీడా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రావెల్ చేస్తే గాయం తీవ్రత పెరిగి దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చని వైద్యులు హెచ్చరికలు జారీ చేశారట. అందుకే కోల్కతాలోని ప్రముఖ హోటల్లో గిల్ ను ఉంచినట్లు తెలుస్తోంది. అందుకే గౌహతికి శుభ్‌మ‌న్ గిల్ ను పంపించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. అంటే రెండో టెస్టులో గిల్ ఆడడం కష్టమేనని చెబుతున్నారు. దాదాపు మూడు నెలల పాటు అతడు క్రికెట్ కు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని కూడా మరి కొంతమంది అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే టీం ఇండియాకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది.

Advertisement

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

గిల్ స్థానంలో సాయి సుదర్శన్ కు అవకాశం

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 22వ తేదీన జరగబోయే రెండవ టెస్ట్ నేపథ్యంలో దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో సాయి సుదర్శన్ ను తుది జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మొదటి టెస్టులో అతన్ని తుది జట్టులో తీసుకోలేదు గంభీర్. కానీ ఇప్పుడు అతనికి అవకాశం వచ్చే ఛాన్స్ ను ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×