Mohammed Siraj : ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. మరోవైపు ఈ సిరీస్ నుంచి వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా గుర్తుకు వచ్చి సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. బుమ్రా.. వెళ్లేటప్పుడూ వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి సిరాజ్ వివరించాడు. ఓవల్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిసిన తరువాత.. బీసీసీఐ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ప్రసిద్ధ్ కృష్ణ-మహమ్మద్ సిరాజ్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Also Read : Saina Nehwal : సైనా నెహ్వాల్ సంచలన ట్విస్ట్.. “దూరం.. దగ్గర” అంటూ..
ఎవ్వరినీ కౌగిలించుకోవాలి..?
ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ.. “జస్సీ భాయ్ వెళ్లేటప్పుడు నేను అతడిని భయా.. ఎందుకు వెళ్తున్నారు..? నేను ఐదు వికెట్లు తీస్తే.. ఎవ్వరినీ కౌగిలించుకోవాలి..? అని అడిగాను” అని వెల్లడించాడు. ఇక సిరాజ్ ప్రశ్నకు బుమ్రా ఇచ్చిన సమాధానం చాలా హృద్యంగా ఉందని తెలిపాడు సిరాజ్. ” నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఐదు వికెట్లు తీసుకో చాలు” అని బుమ్రా బదులు ఇచ్చాడని తెలిపాడు సిరాజ్. ఇంగ్లాండ్ పిచ్ లపై ఆడేందుకు బౌలర్లకు చాలా మంచి అవకాశం లభిస్తుందని సిరాజ్ చెప్పాడు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉండటం సంతోషంగా ఉంది. కానీ మనం మ్యాచ్ గెలిస్తే.. ఇంకా బాగుంటుంది” అని సిరాజ్ పేర్కొన్నాడు. మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు ఈ సిరస్ లో 35.67 సగటుతో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో బెన్ స్టోక్స్ 17 వికెట్లు తీశాడు.
ఆధిక్యంలో టీమిండియా
ప్రస్తుతం ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ టీమిండియా 224 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు టీమిండియా కంటే 23 పరుగులు అధికంగా చేసింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఇప్పటి వరకు 306/6 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 118 పరుగులు చేసి టంగ్ బౌలింగ్ ఓవర్టన్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ 11 పరుగులు, అకాశ్ దీప్ 66 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఆకాశ్ దీప్ ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ 11 పరుగులు.. కరుణ్ నాయర్ 17 పరుగులు, రవీంద్ర జడేజా 27, ధ్రువ్ జురెల్ 27 పరుగులు చేశాడు. ప్రస్తుతం జడేజా, ధ్రువ్ జురెల్ క్రీజులో కొనసాగుతున్నారు. టీమిండియా భారీ స్కోర్ చేస్తేనే ఈ మ్యాచ్ విజయం సాధిస్తుంది. లేదంటే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. ఇండియా విజయం సాధించకుంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇండియా విజయం సాధిస్తే.. టెస్ట్ సిరీస్ డ్రా గా ముగుస్తుంది.