BigTV English

SRH vs RR Qualifier-2: హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్.. ఆరు విశేషాలు..

SRH vs RR Qualifier-2: హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్.. ఆరు విశేషాలు..

SRH vs RR Qualifier-2 Highlights: యుద్ధంలో ఎంతమంది పోరాడినా విజేతలు ఒక్కరే ఉంటారు. అలాగే ఏ ఆటలోనైనా గెలిచేది ఒక్కరే. అది వర్షం వచ్చి మ్యాచ్ జరగకపోతే వేరే సంగతి…కానీ ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకడే విజేత. అందుకే ఈ ప్రపంచంలో సక్సెస్ కే విలువ ఉంటుంది. సక్సెస్ ఉన్నవాడి చుట్టూ ప్రపంచం తిరుగుతుంటుంది. ఇంతకీ ఇదంతా ఎందుకంటే మ్యాచ్ గెలిచినా ఓడినా, ఎన్నో విశేషాలు హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగాయి. అవేమిటో ఒకసారి చూసేద్దాం


  1. ఒకే ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్ గా అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నాడు. ఈ సీజన్ లో 17 వికెట్లు తీశాడు. 2008లో రాజస్థాన్ సారథిగా ఉన్న షేన్ వార్న్ 19 వికెట్లు తీసి నెంబర్ వన్ గా ఉన్నాడు. ఇప్పుడు కమిన్స్ ముందు ఒకటే మ్యాచ్ ఉంది. అయితే ఇందులో రెండు వికెట్లు తీస్తే షేన్ వార్న్ కి సమానం అవుతాడు. మూడు తీస్తే మించిపోతాడు.
  2. ఐపీఎల్ ప్లే ఆఫ్ వరకు వెళ్లి ఎక్కువ సార్లు ఓడిపోయిన 6వ జట్టుగా రాజస్థాన్ నిలిచింది. ఇంతవరకు 11 మ్యాచ్ లు ఆడి, 6 సార్లు ఓటమి పాలైంది.
  3. ఐపీఎల్ ఫైనల్ కు ఎక్కువసార్లు వెళ్లిన ఐదో జట్టు హైదరాబాద్ సన్ రైజర్స్. ఇప్పుడు మూడోసారి ఫైనల్ కు చేరింది. ఈ జాబితాలో సీఎస్కే (10) అందరికంటే ముందుంది.

Also  Read: అటు నవ్వు, ఇటు ఏడుపు.. కట్ చేస్తే.. ఇటు నవ్వు.. అటు ఏడుపు

4. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన 8 ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆరుసార్లు విజయం సాధించింది.


5. ఒకే ఐపీఎల్ సీజన్ లో స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీయడం ఇది రెండోసారి. 9 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశారు.

6. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్ షాబాజ్ (3/23), 2016లో భువనేశ్వర్ 3 /19 ప్రదర్శన చేశాడు.

Tags

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×