BigTV English

MI VS KKR:- స్కై మెరుపులు.. రఫ్ఫాడించిన ఇషాన్.. ముంబైకి మరో గెలుపు..

MI VS KKR:- స్కై మెరుపులు.. రఫ్ఫాడించిన ఇషాన్.. ముంబైకి మరో గెలుపు..

MI VS KKR:- ముంబై ఇండియన్స్ మరో విక్టరీ కొట్టింది. ఐదు వికెట్లు కోల్పోయి కోల్‌కతాపై విజయం సాధించింది. కొంతకాలంగా బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్న సూర్య కుమార్ యాదవ్.. తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. చాలా కాలం తరువాత హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 25 బాల్స్‌లో 43 పరుగులు చేశాడు. మొదట్లో నిలకడగా ఆడుతూ ఆ తరువాత కోల్‌కతా బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు.


186 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై.. మొదటి నుంచే కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఐదు ఫోర్లు, ఐదు సిక్సులతో హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ 20 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఔట్ కాకూడదనే పట్టుదలతో నెమ్మదిగా ఆడాడు. మరో ఎండ్‌లో వచ్చిన తిలక్ వర్మ కూడా సూర్య కుమార్ యాదవ్‌కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన టిమ్ డేవిడ్(24).. 2 సిక్సులు, ఒక ఫోర్‌తో ముంబైకి విజయాన్ని అందించాడు.

ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ… కోల్‌కతా ధాటిగానే ఆడింది. 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 185 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ముంబై బౌలర్ కామ్ గ్రీన్ రెండో ఓవర్లోనే కోల్‌కతాను దెబ్బతీశాడు. జగదీశన్‌కు డకౌట్ చేశాడు. ఆ తరువాత గుర్బాజ్‌ను పీయూష్ చావ్లా 8 పరుగులకే ఔట్ చేశాడు. నితీశ్ రాణాను హృతిక్ షోకీన్.. 5 పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు.


కష్టాల్లో పడిన జట్టును వన్ డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ ఆదుకున్నాడు. వస్తూనే ముంబై ఇండియన్స్ బౌలర్లపై అటాకింగ్‌కు దిగాడు. ఆడిన మొదటి ఓవర్‌లోనే ఏకంగా 16 పరుగులు రాబట్టాడు. వరుస ఫోర్లు, సిక్సులు కొడుతూ 23 బాల్స్‌కే హాఫ్ సెంచరీ చేశాడు. 49 బంతుల్లో సెంచరీ చేసిన వెంకటేశ్ అయ్యర్(104).. ఆ తరువాత రెండు బాల్స్‌కే ఔట్ అయ్యాడు. మొత్తం 9 సిక్సులు, 6 సిక్సులు బాది.. ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

శార్దూల్ ఠాకూర్ ఫెయిల్ అయ్యాడు. 11 బాల్స్‌లో 13 పరుగులే చేశాడు. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్ ఇంప్రెస్ చేయలేకపోయాడు. 18 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇక ఆండ్రూ రస్సెల్స్ చివర్లో మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. దీంతో స్కోర్ 185 పరుగులకు చేరింది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×