BigTV English
Advertisement

Smriti Mandhana : కోచ్ బాగా తిట్టాడు.. అది పనిచేసింది.. స్మృతి మంధాన

Smriti Mandhana : టీమ్ ఇండియా అమ్మాయిలు, ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్ లో విజయం సాధించి 1-0తో ఆధిక్యం సాధించారు. ఆ గెలుపు కూడా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సాధించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ స్మృతి మంధాన ఆసక్తికర విషయాలు తెలిపింది. తను ఈ మ్యాచ్ లో షఫాలి వర్మ (64 నాటౌట్) తో కలిసి స్మృతి 54 పరుగులు చేసింది.

Smriti Mandhana : కోచ్ బాగా తిట్టాడు.. అది పనిచేసింది.. స్మృతి మంధాన

Smriti Mandhana : టీమ్ ఇండియా అమ్మాయిలు, ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్ లో విజయం సాధించి 1-0తో ఆధిక్యం సాధించారు. ఆ గెలుపు కూడా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సాధించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ స్మృతి మంధాన ఆసక్తికర విషయాలు తెలిపింది. తను ఈ మ్యాచ్ లో షఫాలి వర్మ (64 నాటౌట్) తో కలిసి స్మృతి 54 పరుగులు చేసింది.


మూడు వన్డేల సిరీస్ కోల్పోవడంతో మా హెడ్ కోచ్ అమోల్ మజుందర్ మమ్మల్ని బాగా తిట్టాడు. అంటే కాస్త కఠినంగానే వ్యవహరించాడు. ఇది బాగా పనిచేసింది. ఒకసారి అందరం ఆత్మ విమర్శ చేసుకున్నామని తెలిపింది. ఆయన చెప్పడమే కాదు  నిజంగానే వన్డే సిరీస్ కోల్పోవడం మాకు డైజస్ట్ కాలేదని తెలిపింది. 

పొరపాటు ఎక్కడ జరిగిందని విశ్లేషించుకున్నాం. ఇలా అన్నిరకాలుగా మాకు మేం మానసికంగా సన్నద్ధమయ్యాం. అందరం కలిసి దృఢంగా ఆడాలని నిర్ణయించుకున్నాం. టీ 20 సిరీస్ కోసం రెండురోజుల్లోనే సన్నద్ధమయ్యామని తెలిపింది.


 బెంగాల్ నుంచి వచ్చిన ఫాస్ట్ బౌలర్ టిటాస్ సాధు అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు సాధించిందని తెలిపింది. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని తెలిపింది. తను చెప్పినట్టుగానే సాధుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణించామని తెలిపింది. ఇది సమష్టి కృషి అని తెలిపింది. ఇప్పుడే అంతా అయిపోలేదని చెప్పింది. మరో రెండు టీ 20 లు నెగ్గి సిరీస్ విజయం దక్కినప్పుడే అసలైన ఆనందమని తెలిపింది.

 ఫీల్డింగ్ కోచ్ వల్లే క్యాచ్ లు బాగా పట్టారని తెలిపింది. ప్రధాన కోచ్ చెప్పడం వల్ల చివరి నిమిషంలో స్పిన్నర్ బదులు పేసర్ టిటాస్ సాధుని తుది జట్టులోకి తీసుకున్నామని పేర్కొంది. అదే విజయానికి బాటలు వేసిందని వివరించింది. ఈ మ్యాచ్ లో హర్మన్ నాలుగు క్యాచ్ లు పట్టడం విశేషం.

Related News

Rashid Khan : రెండో పెళ్లి చేసుకున్న రషీద్ ఖాన్.. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందిగా!

Shreyas Iyer: పాపం శ్రేయాస్‌ అయ్య‌ర్‌.. టీమిండియాకు మరో ఊహించని ఎదురు దెబ్బ

Harmanpreet Kaur: బికినీలో టీమిండియా కెప్టెన్‌..ఆమెతోనే స‌హ‌జీవ‌నం అంటూ ట్రోలింగ్ ?

Sanju Samson: సంజు పుట్టిన రోజు..అగ్గిరాజేసిన CSK ట్వీట్‌..అత‌ని వ‌ల్ల జ‌ట్టుకు ఉప‌యోగం ఏంటంటే

Richa Ghosh: మమతా అంటే మాములుగా ఉండ‌దు..రిచా ఘోష్ పేరుతో స్టేడియం, డీఎస్పీ ప‌ద‌వి

Shreyas Iyer: మ‌గాడంటే వాడే, శ్రేయాస్ అయ్య‌ర్ కు పెళ్లాన్ని అయిపోతా..హీరోయిన్ సంచ‌ల‌నం !

Shreyas Iyer: చావు దాక వెళ్లి వ‌చ్చాడు, ఇప్పుడు బీకినీ పాప‌ల‌తో బీచ్ లో ఎంజాయ్ !

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

Big Stories

×