IND Vs AUS : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేము. ముఖ్యంగా క్రీడాకారుడు లేదా క్రీడాకారుని అద్భుతమైన ఫామ్ కనబరుస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అస్సలు ఫామ్ లో ఉండరు. తాజాగా భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధన రికార్డు సృష్టించింది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కి దిగగా.. స్మృతి మంధన మెరుపు శతకంతో చెలరేగింది.
Also Read : Team India : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు… ఇప్పటివరకు ఏ జట్టు సాధించని చరిత్ర
కేవలం 77 బంతుల్లోనే సెంచరీ బాది.. భారత మహిళల వన్డేల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. టీమిండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ కూడా స్మృతి మంధన పేరిటనే ఉండటం విశేషం. ఇదే ఏడాది ఐర్లాండ్ పై ఆమె 70 బంతుల్లోనే సెంచరీ చేసింది. తాజాగా చేసిన సెంచరీ మంధనకు వన్డేల్లో 12వ సెంచరీ కావడం విశేషం. మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్ బ్యాటర్ గా సూజీబేట్స్ (న్యూజిలాండ్), ట్యామి బేమఔంట్ (ఇంగ్లాండ్) సరసన చేసింది. మంధన, బేట్స్, బేమౌంట్ ఓపెనర్లుగా 12 సెంచరీలు చేశారు. బేట్స్, బేమౌంట్ కంటే కూడా మంధన నే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించడం అద్భుతం అనే చెప్పాలి. బేట్స్ 130 ఇన్నింగ్స్ ల సమయం తీసుకుంటే.. బేమౌంట్ కి 113 ఇన్నింగ్స్ లు అవసరం కాగా.. మంధన తన 106వ ఇన్నింగ్స్ లోనే 12 సెంచరీల మార్కు తాకింది.
తాజా సెంచరీతో మంధన మరో చారిత్రక రికార్డును కూడా సొంతం చేసుకుంది. మహిళల వన్డేల్లో 3 కి పైగా సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లో 4 సెంచరీలు.. ఈ ఏడాది ఇప్పటికే 3 సెంచరీలు పూర్తి చేసుకుంది. ఇంకా మూడు నెలల సమయంలో 2 సెంచరీలు అయినా చేసే అవకాశం లేకపోలేదు. తాజా సెంచరీతో మంధన రెండు వేర్వేరు దేశాలపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ట్యామీ బేమౌంట్ తో పాటు మూడో స్థానంలో నిలిచింది. మెగ్ లాన్నింగ్ 15 అగ్రస్థానంలో ఉండగా.. సూజీ బేట్స్ 13, బేమౌంట్ 12, మంధన 12 ఆ తరవుఆత స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో మంధన 91 బంతుల్లో 14 ఫోర్లు, 4సిక్సర్లతో 117 పరుగులు చేసి ఔట్ అయింది. తొలి హాప్ సెంచరీకి 45 బంతులు.. ఆ తరువాత హాఫక్ సెంచరీ 32 బంతుల్లో పూర్తి చేసింది. హాఫ్ సెంచరీ సిక్సర్ తో, సెంచరీని ఫోర్ తో అందుకుంది మంధన. ఈ మ్యాచ్ లో టీమిండియా 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసింది.