Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాటిపత్రి గ్రామంలోని ఓ బావిలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలడం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాలను బావి నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతులను రంపం శ్రీను, సూరిబాబుగా గుర్తించారు. డాగ్‌స్క్వాడ్ , క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వల్లే గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిని హత్య చేసి బావిలో పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.