E-Paper

మహిళలను కోటీశ్వరులను చేస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

మహిళలను కోటీశ్వరులను చేస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్!
Advertisement

KTR Challenge: స్వేచ్ఛ బ్యూరో: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, అది నెరవేరితే నిరూపించాలని, లేని పక్షంలో తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ.1.25లక్షలు బాకీ ఉందని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ప్రజా తీర్పును అవమానించడమేనన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్

Advertisement

తెలంగాణ భవన్ లో ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి సీఎం అని కేటీఆర్ విమర్శించారు. మీనాక్షి నటరాజన్‌కు టిక్కెట్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం.. కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఉన్న కొంత మంది వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి అన్నారు.

కాంగ్రెస్ పాలన.. అట్టర్ ఫ్లాప్

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ‘అట్టర్ ఫ్లాప్’గా అభివర్ణించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు మిగిలింది ఏండ్ కార్డే అన్నారు. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తున్నదన్నారు.

Also Read: సోలాపూర్‌లో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 8 మంది మృతి!

ఇచ్చిన హామీలపై ప్రశ్నలు

సగం కాలం ముగిసినా ఒక్క హామీల అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఒక అట్టర్ ప్లాప్ సినిమాతో పోల్చారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అలాగే నిరుద్యోగ భృతి రూ.4వేల హామీని కూడా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారని ఆరోపించిన రేవంత్, ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు.

మళ్లీ బీఆర్ఎస్ గెలుపు ఖాయం

త్వరలో ఉపఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి, మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని, ప్రజలు ఈ అసమర్థ పాలనను ఇంకా రెండున్నరేళ్లు భరించాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఇటుక కూడా కొత్తగా పేదలకు ఇళ్లు కట్టించని ప్రభుత్వం, ఉన్న ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. జీవో నెంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ‘2014కు ముందు హైదరాబాద్‌లో కరెంట్ సమస్యలు ఉండేవి, కానీ కేసీఆర్ పాలనలో 24 గంటల నిరంతర విద్యుత్ అందించామన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక, హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తామన్నారు. 20 వేల లీటర్ల ఉచిత నీటిని అందించిన ఘనత కేసీఆర్‌దే’ అని స్పష్టం చేశారు.

మూడోసారి కూడా సిద్దం అవ్వండి..

‘నిజాం కాలం తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఒక్క పెద్ద ఆస్పత్రి నిర్మించలేదు. కానీ కేసీఆర్ నాలుగు టిమ్స్ ఆస్పత్రులను, వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారని, 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి, బసవతారకం ఆస్పత్రిలో పేద రోగుల సహాయకుల కోసం ధర్మశాలలు కట్టించారన్నారు. రూ. 5 అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ది అన్నారు. అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం’ అని దుయ్యబట్టారు. ఖైరతాబాద్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశాం, మూడోసారి కూడా సిద్ధం కావాలన్నారు.

Also Read: నలుగురిపైకి దూసుకెళ్లిన రైలు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి!

త్వరలో ఉప ఎన్నిక రావడం ఖాయం

దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్ పక్కన కూర్చున్నారన్నారు. బీఆర్ఎస్ గుర్తుతో గెలిచిన దానం నాగేందర్ వల్ల త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. ప్రతి ఓటు విలువైనది, బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలని సూచించారు. ఈనెల 25 నుంచి జూలై 31 వరకు జరిగే సర్ (సమగ్ర ఇంటింటి సర్వే) నమోదులో ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలన్నారు. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నాయని, టికెట్ ఆశించే వారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని సూచించారు. అంబేద్కర్ చెప్పినట్లుగా జనగణన, ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

తనసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఉద్యమ పార్టీ గులాబీ పార్టీ అన్నారు. ఉన్న సిటీ లో నీళ్లివ్వలేని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారా? అని నిలదీశారు.పదేండ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశంలోనే ఆదర్శంగా నిలిపిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది అని ప్రశ్నించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనిదే అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు..గులాబీ జెండా ఎగిరేయడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే సంజయ్, రాష్ట్ర నాయకులు మన్న గోవర్ధన్ రెడ్డి, తలసాని సాయికుమార్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. అంబర్‌పేట వేదికగా కిషన్ రెడ్డి ధ్వజం!

అవసరమైతే నేనూ రోడ్డు మీదికి వస్తా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

బిఆర్ఎస్ ఓట్లు లేపేయడమే కాంగ్రెస్, బిజేపి టార్గెట్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం!

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. ఇబ్రహీంపట్నంలో ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!

Telangana Health: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య శాఖ మార్క్.. రికార్డు స్థాయిలో పూర్తి చేసిన పనులివే..?

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. విద్యార్థులు, యువత రాక, ​పేపర్ లీకేజీలపై ఆగ్రహం

×