ASIA CUP 2025 : ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సెప్టెంబర్ 09న ప్రారంభం అవ్వనున్న విషయం తెలిసిందే. అంటే..? ఆసియా కప్ (Asia Cup ) ప్రారంభానికి కేవలం ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇవాళ టీమిండియా (Team India) ఆటగాళ్లు దుబాయ్ చేరుకునేందుకు ఒక్కొక్కరుగా వెళ్లారు. ఇవాళ రాత్రి వరకు అందరూ కలుసుకుంటారు. దుబాయ్ కి వెళ్లిన తరువాత 5 రోజుల పాటు దుబాయ్ లో ప్రాక్టీస్ చేయనున్నారు. సెప్టెంబర్ 09న అప్గానిస్తాన్ వర్సెస్ హాంగ్ కాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. సెప్టెంబర్ 10న భారత్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్ (Pakistan) మాత్రం సెప్టెంబర్ 14న భారత్ వర్సెస్ పాక్ (Ind vs pak) మ్యాచ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించిన పోస్టర్ ను తాజాగా సోనీ టీవీ విడుదల చేసింది.
Also Read : BCCI President : బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ క్రికెటర్..?
అయితే ఇటీవల సోనీ టీవీ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి గ్రూపు ఏ, గ్రూపు బీ రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు ఏ లో భారత్, యూఏఈ, పాకిస్తాన్, ఓమన్ దేశాలు ఉన్నాయి. గ్రూపు బీ లో అప్గానిస్తాన్, హాంకాంగ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఉన్నాయి.మొత్తం 8 జట్లు ఆసియా కప్ లో పాల్గొంటాయి. అయితే తొలి అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య జరుగనుంది.
సెప్టెంబర్ 20 శనివారం గ్రూపు బీలో గెలిచిన టాప్ 2 జట్లు తలపడతాయి. ( జాయెద్ క్రికెట్ స్టేడియం)
సెప్టెంబర్ 21 ఆదివారం గ్రూపు ఏలో గెలిచిన టాప్ 2 జట్లు తలపడతాయి. (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం)
సెప్టెంబర్ 23 మంగళవారం గ్రూపు లో రెండో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూపు బీలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు. ( జాయెద్ క్రికెట్ స్టేడియం)
సెప్టెంబర్ 24 బుదవారం గ్రూపు ఏలో మొదటి స్తానం జట్టు, గ్రూపుబీ లో 2వ స్థానం (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం )
సెప్టెంబర్ 25 గురువారం రెండు గ్రూపుల్లో రెండో స్థానాల్లో నిలిచిన జట్లు (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం)
సెప్టెంబర్ 26 శుక్రవారం రెండు గ్రూపుల్లో టాప్ 1 లో నిలిచిన జట్లు తలపడతాయి. (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం)
సెప్టెంబర్ 28 టాప్ 2 జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి. (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం)
ఇక ఇందులో ప్రతి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. కానీ సెప్టెంబర్ 15న తలపడే ఒమన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ మాత్రం 5.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ని ఉచితంగా వీక్షించాలంటే..? Star Sports, Disney+ Hotstar app and website, sony టీవీలో చూడవచ్చు.