BigTV English

Local Trains: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 238 కొత్త రైళ్లకు సూపర్ ఫీచర్.. జర్నీ చాలా స్మార్ట్ గురూ!

Local Trains: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 238 కొత్త రైళ్లకు సూపర్ ఫీచర్.. జర్నీ చాలా స్మార్ట్ గురూ!

Local Trains: ప్రతిరోజూ రైలు ప్రయాణం అంటే కిక్కిరిసిన బోగీలు, ఊపిరాడని పరిస్థితి, ఎక్కితే దిగలేమన్న టెన్షన్. కానీ ఇక ఆ టెన్షన్ స్టాప్ అవబోతోంది. కొత్తగా వస్తున్న ఈ రైళ్లలో అడుగు పెట్టిన క్షణం నుంచి ప్రయాణం అంతా కొత్త అనుభవం, మెట్రో టచ్‌తో సూపర్ కంఫర్ట్. ఏం మారబోతోంది? ఎక్కడ మారుతోంది? తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.


ముంబై ప్రయాణికులకు ఒక పెద్ద శుభవార్త లభించింది. మహారాష్ట్ర మంత్రివర్గం తాజాగా రూ. 4,826 కోట్ల భారీ పెట్టుబడిని ఆమోదించింది. ఈ నిధులతో మొత్తం 238 కొత్త ఎయిర్ కండీషన్డ్ లోకల్ ట్రైన్లు కొనుగోలు చేయనున్నారు. ఇది ఇప్పటివరకు ముంబై నగరానికి జరిగిన అతిపెద్ద రైల్వే రోలింగ్‌ స్టాక్‌ అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ కింద అమలు కానుంది. ఇప్పటికీ అధిక జనసంచారం, కిక్కిరిసిన పరిస్థితులు ఎదుర్కొంటున్న ముంబై లోకల్ రైలు నెట్‌వర్క్‌కు ఇది ఒక ఊపిరి పీల్చే అవకాశం కలిగించే ముందడుగుగా మారింది.

కొత్త AC ట్రైన్లు.. మెట్రో తరహా ఫీచర్లు

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి ముంబై రైల్వే డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నాయకత్వం వహిస్తోంది. ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమిటంటే, ఈ భారీ ప్రాజెక్టు కోసం ఎటువంటి బాహ్య రుణాలు తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మరియు రైల్వే బోర్డు సంయుక్తంగా ఖర్చు భరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 2,413 కోట్లు ఇవ్వనుంది. తుది ఆమోదం సెంట్రల్ రైల్వే బోర్డు నుంచి రానుంది.


కొత్తగా రాబోయే ఈ AC ట్రైన్లు ప్రస్తుతం నడుస్తున్న పాత, తలుపుల్లేని రైళ్ల స్థానంలో వస్తాయి. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ఈ AC ట్రైన్ల టికెట్ ఛార్జీలు, ప్రస్తుతం ఉన్న నాన్-AC లోకల్స్ ఛార్జీలతో సమానంగానే ఉంటాయి. అంటే ప్రయాణికులు అదనపు భారం లేకుండా ఆధునిక వసతులను అనుభవించగలరు. ఈ కొత్త ట్రైన్లలో ఆటోమేటిక్ డోర్స్, మెట్రో స్టైల్ ఫీచర్లు, ఆధునిక సిస్టమ్స్ ఉండటం వలన ప్రయాణం మరింత సులభతరం, సురక్షితంగా మారనుంది.

MUTP-3B కింద 136.65 కి.మీ. కొత్త సబ్‌ర్బన్ లైన్లు

రైల్వే నెట్‌వర్క్‌లో మరో ప్రధాన ముందడుగు ఏమిటంటే, రాష్ట్ర మంత్రివర్గం 136.65 కిలోమీటర్ల కొత్త సబ్‌ర్బన్ రైల్వే లైన్ల నిర్మాణాన్ని కూడా ఆమోదించింది. ఇందులో ముఖ్యంగా బద్లాపూర్–కర్జత్ మధ్య మూడో మరియు నాల్గో ట్రాక్‌లు, అలాగే పన్వేల్ – వసాయి కొత్త కారిడార్ ఉంటాయి. ఈ మార్పులు రాబోయే కాలంలో ముంబై లోకల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌ను పూర్తిగా మార్చేస్తాయని రైల్వే అధికారులు అంటున్నారు. ఎక్కువగా కిక్కిరిసే సమయాల్లో కూడా ట్రాఫిక్ తగ్గి, ప్రయాణం సాఫీగా సాగుతుంది.

కొత్త టెక్నాలజీ.. భద్రతపై ప్రత్యేక దృష్టి

ప్రయాణికులకు మాత్రమే కాదు, రైల్వే టికెటింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి కూడా ముంబై రైల్వే పెద్ద అడుగులు వేసింది. ఇప్పటివరకు స్టాటిక్ QR కోడ్‌ల వల్ల కొందరు ప్రయాణికులు టికెట్ చెక్ తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక QR కోడ్ సేవ్ చేసుకుని మళ్లీ మళ్లీ వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ లోపాన్ని తొలగించేందుకు డైనమిక్ QR కోడ్స్ ను ప్రవేశపెడుతున్నారు. ఇవి ప్రతి సారి కొత్తగా రిఫ్రెష్ అవుతాయి. దీంతో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా, న్యాయంగా టికెట్లు వినియోగించేలా చేస్తుంది.

Also Read: Ramagundam Station: నిన్నటి వరకు ఆ స్టేషన్ జీరో.. ఇప్పుడు హీరో.. మీ సమీపంలోనే ఓ లుక్కేయండి!

ఇక భద్రత విషయానికి వస్తే, వెస్ట్రన్ రైల్వే ఆధ్వర్యంలో ముంబై లోకల్ ట్రైన్లలో CCTV కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, AI ఆధారిత సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, ఏదైనా ఘటనలు జరిగితే దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడతాయి. ప్రయాణికుల ప్రాణభద్రతకు సంబంధించి మరో కీలక మార్పు.. అన్ని లోకల్ ట్రైన్లలో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. దీని వలన ప్రయాణికులు తలుపుల దగ్గర కిక్కిరిసే పరిస్థితి లేకుండా, సురక్షితంగా ప్రయాణించగలరు.

ముంబైకి కొత్త ఊపిరి

ముంబై లోకల్ ట్రైన్ నెట్‌వర్క్‌నే నగరానికి “లైఫ్‌లైన్” అంటారు. రోజూ కోట్ల సంఖ్యలో ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో 238 కొత్త AC ట్రైన్లను జోడించడం ముంబై చరిత్రలోనే మొదటిసారి. ముఖ్యమంత్రి దీన్ని “టర్నింగ్ పాయింట్” గా అభివర్ణించారు. అధిక జనసంచారంతో ఇబ్బంది పడుతున్న రైల్వే వ్యవస్థకు ఇది నిజంగా ఊరట ఇస్తుందని అన్నారు.

ముంబై రైల్వేకు ఇది ఒక కొత్త దశ. కొత్త AC ట్రైన్లు, కొత్త సబ్‌ర్బన్ లైన్లు, టెక్నాలజీ ఆధారిత టికెట్టింగ్ సిస్టమ్, భద్రతా చర్యలు.. ముంబై రైల్వే నెట్‌వర్క్‌ను పూర్తిగా ఆధునికంగా మార్చబోతున్నాయి. ప్రయాణికులు ఇకపై సౌకర్యవంతంగా, సురక్షితంగా, తక్కువ ఛార్జీలతో ప్రయాణించగలరు. ముంబై నగర అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Related News

Meteorite: ఆకాశం నుంచి పడ్డ బంగారు ఉల్క.. అసలు విషయం తెలిసి అంతా షాక్!

Ramagundam Station: నిన్నటి వరకు ఆ స్టేషన్ జీరో.. ఇప్పుడు హీరో.. మీ సమీపంలోనే ఓ లుక్కేయండి!

No Passport – No Visa: ఇక వాళ్లు పాస్‌ పోర్ట్, వీసా లేకుండానే రావచ్చు.. భారత్ కీలక నిర్ణయం!

Tourists Free Flights: ఈ దేశానికి వెళ్తే మీరు విమానాల్లో ఫ్రీగా తిరగొచ్చు.. చిల్లిగవ్వ కూడా చెల్లించక్కర్లేదు!

Flight Passenger: ఫ్లైట్ 14 గంటలు ఆలస్యమైతే బర్గర్ ఇస్తారా? ప్రయాణీకుడికి రూ. 55 వేలు కట్టాల్సిందే!

Big Stories

×