BigTV English

Sourav Ganguly: ఫైనల్ గెలవకపోతే బార్బడోస్ సముద్రంలో దూకేలా ఉన్నాడు.. రోహిత్ పై గంగూలీ సరదాగా కామెంట్లు

Sourav Ganguly: ఫైనల్ గెలవకపోతే బార్బడోస్ సముద్రంలో దూకేలా ఉన్నాడు.. రోహిత్ పై గంగూలీ సరదాగా కామెంట్లు

Sourav Ganguly Funny Comments on Rohit sharma T20 World Cup2024 Final Match: టీమ్ ఇండియాలో అగ్రెసివ్ కెప్టెన్ ఎవరంటే, సౌరభ్ గంగూలీ అని అంతా అంటారు. ఒకరకంగా జట్టులో దాదా అని అందరూ పిలిచేవారు. అలా ఉండేవాడు. ఆటలో, జట్టులో  ఎవరైనా వేలు పెడితే ఊరుకునే వాడు కాదు. రికమండేషన్లు ఒప్పుకునే వాడు కాదు. ఎంతటివారినైనా లెక్క చేసేవాడు కాదు. జట్టు కోసం, ఇండియా గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడు.


మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ వీళ్లందరికీ గురువు అనే చెప్పాలి. అంతే కాదు నేడు రోహిత్ కెప్టెన్సీ చేయడానికి ప్రధాన కారకుడు గంగూలీయే. తను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రోహిత్ కి బలవంతంగా కెప్టెన్సీ అందించాడు.  కోల్‌కతాలో ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న గంగూలీ ఈ మేరకు మీడియాతో మాట్లాడాడు. రోహిత్ పై ఉన్న చనువుతో ఫైనల్ మ్యాచ్ పై సరదాగా ఒక జోక్ పేల్చాడు.

ఒకవేళ ఇండియా ఫైనల్ లో గెలవకపోతే రోహిత్ శర్మ, అక్కడే ఉన్న బార్బడోస్ సముద్రంలో దూకేలా ఉన్నాడని అన్నాడు. ఎందుకంటే తనంత ప్రాణం పెట్టి మ్యాచ్ లు ఆడుతున్నాడని తెలిపాడు. ఈ టీ 20 వరల్డ్ కప్ లో ఎంతో భావోద్వేగంతో కనిపించాడని తెలిపాడు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడని తెలిపాడు. నాడు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో మంచి పట్టుదలతో ఉన్నాడని తెలిపాడు. భారత్ కెప్టెన్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా రెండు మెగా టోర్నమెంట్లను ఫైనల్ వరకు తీసుకువెళ్లడం గొప్ప విషయమని కితాబిచ్చాడు.


Also Read: అదృష్టం మనవైపే ఉంది.. ఫైనల్ మ్యాచ్ పై ద్రవిడ్

ప్రస్తుతం అతడి సారధ్యంలో భారత క్రికెట్ పురోగతి అద్భుతంగా ఉందని, ఇది తనకు చాలా సంతోషంగా ఉందని గంగూలీ పేర్కొన్నాడు. టోర్నీ షెడ్యూల్ బిజీగా గజిబిజిగా ఉండటం, సమయం లేకపోవడం, రెండు విభిన్న ప్రాంతాలైన అమెరికా, వెస్టిండీస్ ల్లో నిర్వహించడం.. వీటన్నింటి వల్ల ఐపీఎల్ టైటిల్స్ గెలవడం కొన్నిసార్లు సవాలుగా ఉంటుందని అన్నాడు.

Tags

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×