BigTV English

South Africa : దక్షిణాఫ్రికా ఆరంభ శూరత్వమేనా?

South Africa : దక్షిణాఫ్రికా ఆరంభ శూరత్వమేనా?
South Africa

South Africa : ప్రపంచ క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా గురించి చెప్పాలంటే వారంత దురద్రష్టకరమైన జట్టు లేదనే చెప్పాలి. ఏ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ అయినా సరే, మొదట క్వాలిఫైయింగ్ మ్యాచుల్లో జూలు విదిల్చిన సింహాల్లా రెచ్చిపోతారు. ప్రపంచంలో మేటి బ్యాట్స్ మెన్లు అందరూ అక్కడే ఉన్నారా? అన్నట్టు ఆడతారు. సరిగ్గా కీలకమైన సమయంలో ఒత్తిడికి లోనై, ప్రత్యర్థికి పప్పుబెల్లంలా అప్పగించేస్తారు.వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా  వారు ఫైనల్స్ కి వెళ్లలేదు. టాప్ 8 దేశాల్లో ఉండి కూడా కనీసం రన్నరప్ కూడా కాలేకపోయింది. ఎన్నో  టోర్నమెంట్లలో కీలకమైన దశలో చేతులెత్తేయడం సౌతాఫ్రికాకు ఆనవాయితీగా మారిందనే అపప్రధ ఉంది.


ఇప్పుడు వరల్డ్ కప్ లో ఆడిన రెండింటిలో అరవీర భయంకరంగా స్టార్ట్ చేశారు. మొత్తం మీద పది మ్యాచ్ లు జరిగితే పాయింట్ల పట్టికలో ఇప్పుడు సౌతాఫ్రికా టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా అయితే అడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. అంటే తొమ్మిదో స్థానం. ఇక ఇండియా మూడోస్థానంలో ఉంది.

 సౌతాఫ్రికా విషయానికి వస్తే  మిల్లర్, క్లాసెన్ లాంటి భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. అలాగే టీమ్ అంతా బ్రహ్మండమైన ఫామ్ లో ఉన్నారు. గతమంతా ఒక లెక్క..ఇప్పుడొక లెక్కగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అందుకని ఈసారి సౌతాఫ్రికాను అంత తేలిగ్గా తీసుకోలేమని చెబుతున్నారు.


నిజానికి క్రీడా పండితుల అంచనా ప్రకారం వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరెట్ జట్లలో వరుసగా ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడు జట్లు ఉన్నాయి. తర్వాత వరుసగా పాకిస్తాన్,  న్యూజిలాండ్ ఉన్నాయి. చివరికి ఆరో ప్లేస్ లో సౌతాఫ్రికా కనిపిస్తోంది. అంటే చూశారు కదండీ వరల్డ్ కప్ కి ముందు అందరి ప్రిడిక్షన్ ఎలా ఉందో…కానీ ఇప్పుడు సౌతాఫ్రికా ఆడుతున్న తీరు చూస్తుంటే ఈ లెక్కలు నమ్మబుద్ధిగా ఉన్నాయా? మీరే చూడండి…
మరి ఈసారైనా చివరివరకు నిలుస్తారా? ఎప్పటిలా కీలకమైన సెమీఫైనల్స్ లో చతికిలబడతారా? అన్నది వేచి చూడాల్సిందే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×