SA vs NZ: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా… ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( New Zealand vs South Africa ) తలపడుతున్నాయి. అయితే ఇందులో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు… భారీ స్కోర్ చేసింది. ముందుగా చెప్పుకున్నట్లుగానే 350 కి పైగా స్కోర్ చేసి సౌత్ ఆఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ డేంజర్ ఆటగాడు రచిన్ రవీంద్ర, అలాగే కేన్ విలియమ్సన్… ఇద్దరు కూడా సఫారీలకు చుక్కలు చూపించారు. ఇద్దరు సెంచరీలు చేసుకొని రికార్డు కూడా సృష్టించారు. ఈ తరుణంలోనే నిర్ణీత 50 ఓవర్లలో…6 వికెట్స్ కోల్పోయి 362 పరుగులు చేసింది.
Also Read: SRH Fan Meet: IPL 2025 కంటే ముందే ఫాన్స్ కు గుడ్ న్యూస్.. SRH కీలక ప్రకటన !
ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ జట్టు బ్యాటర్లలో… ఓపెనర్ గా వచ్చిన రచిన్ రవీంద్ర… 101 బంతుల్లో 108 పరుగులు చేసి రఫ్పాడించాడు. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో ఒక సెంచరీ చేసుకున్న రవీంద్ర… ఇవాళ మరో సెంచరీ చేసి దుమ్ము లేపాడు. రవీంద్ర ఇన్నింగ్స్ లో ఒక సిక్సర్ తో పాటు 13 బౌండరీలు ఉన్నాయి. అటు ఫస్ట్ డౌన్ లో వచ్చిన కేన్ మామ… కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొన్న టీం ఇండియా పైన 80 పైగా పరుగులు చేసిన కేన్ మామ… ఇవాళ 94 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే 10 బౌండరీలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన మిచెల్ 49 పరుగులు చేయగా… ఫిట్నెస్ స్టార్.. ఫిలిప్స్ కూడా అద్భుతంగా రాణించాడు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది.
ఇది ఇలా ఉండగా… ఇవాళ లాహోర్ వేదికగా జరుగుతున్న… సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లో… గెలుపొందిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మార్చి 9వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాల్టి మ్యాచ్ లో గెలిచిన జట్టు టీమ్ ఇండియాతో తలపడుతుంది. ఇప్పటికే నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. ఇక దుబాయ్ వేదికగా టీమిండియాతో ఇవాళ విజయం సాధించిన టీం… తలపడనుంది.
Also Read: Virat – Anushka: గ్రౌండ్ లోనే కోహ్లీ, అనుష్క రొమాం***టిక్ సైగలు.. ఫిదా కావాల్సిందే !
హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో… కచ్చితంగా ఫైనల్ ఈసారి దుబాయ్ లో జరుగుతుంది. దీంతో పాకిస్తాన్ అభిమానులు… తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆతిథ్యం ఇచ్చిన దేశం తమదైతే… ఇండియా కారణంగా దుబాయిలో ఫైనల్ జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా… నిర్ణీత 50 ఓవర్లలో… 7.20 రన్ రేట్ తో 363 పరుగులు చేస్తే… న్యూజిలాండ్ పైన దక్షిణాఫ్రికా గెలుస్తుంది. మరికాసేపట్లోనే బ్యాటింగ్ కూడా ప్రారంభం కానుంది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు ఉన్న నేపథ్యంలో కచ్చితంగా సఫారీలు బాగా ఆడతారని అందరూ అంటున్నారు.