Lady Aghori: ఏపీలో లేడీ అఘోరీ రోజుకొక పోలీస్ స్టేషన్ దారి పడుతున్నారు. మొన్న తణుకు పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అఘోరీ అక్కడ కూడా హల్చల్ చేస్తున్నారు. మొత్తం మీద అఘోరీ ఎపిసోడ్ ఏపీలో రోజుకొక కొత్త మలుపులు తిరుగుతూ సాగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం లేని పేరు లేడి అఘోరీ. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో వెలుగులోకి వచ్చిన అఘోరీ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇప్పటికే ఆమెపై పలు కేసులు సైతం తెలంగాణలో నమోదయ్యాయి. వరంగల్ లో కోడిని బలిచ్చిన ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు వేములవాడ రాజన్న ఆలయంలో దర్గాను కూల్చివేస్తానంటూ అఘోరీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత వేములవాడ వెళ్తున్న అఘోరీని పోలీసులు అడ్డుకున్నారు. ఇలా తెలంగాణలో అఘోరీ నిరంతరం వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం తన మకాం ఏపీకి మార్చి అక్కడ కూడా అఘోరీ రోజుకొక పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారని చెప్పవచ్చు. ఇటీవల తణుకు వెళ్లిన లేడీ అఘోరీ అక్కడి అఘోరా రాజేష్ నాథ్ ఆశ్రమం వద్ద నిరసన తెలిపారు. ఓ యువతి వీడియో ద్వారా రాజేష్ నాథ్ అఘోరాపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే లేడీ అఘోరీని ఆశ్రయిస్తే వీడియో రిలీజ్ చేసి జరిగిన విషయాన్ని తెలపాలని సలహా ఇచ్చినట్లు ఆ యువతి తెలిపారు. ఎలాగైనా రాజేష్ నాథ్ పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఆతర్వాత తణుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి, ఎప్పుడూ వెంటపెట్టుకుంటున్న పెట్రోల్ క్యాన్ తీసి శరీరంపై పోసుకొని ఆత్మహత్యా యత్నానికి యత్నించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇలా అఘోరీ తణుకులో వణుకు పుట్టించారని చెప్పవచ్చు.
తాజాగా బుధవారం గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన అక్కడ కూడా హల్చల్ చేశారు. గుంటూరుకు చెందిన హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహేరా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరుకు వచ్చినట్లు తెలుస్తోంది. అఘోరికి బెహేరా అనిల్ మధ్య కొద్ది రోజులుగా వివాదం సాగుతుండగా, ఆ వివాదం నేపథ్యంలో అఘోరీ అక్కడికి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. గుంటూరుకు వస్తున్న అఘోరిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్ బెహేరాను అరెస్ట్ చేయాలని అఘోరి డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఆమెతో మాట్లాడుతుండగా, అఘోరీ చర్యలు తీసుకుంటారా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Nara Lokesh: 11వ బ్లాక్ ఎదురుచూస్తోంది.. జగన్ అసెంబ్లీకి రావచ్చు.. లోకేష్ సెటైర్స్
పోలీసులు మాత్రం అసలు ఏం జరిగిందనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో హల్చల్ చేసిన లేడీ అఘోరీ, ఏపీలో తన హవా కొనసాగిస్తోందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఏదొక వివాదంలో ఉండే అఘోరీ తాజాగా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. మొత్తం మీద లేడీ అఘోరీ ఎప్పుడు ఎక్కడ ఉంటారనే విషయం పక్కన ఉంచితే, వివాదాలకు కేంద్ర బిందువుగా మారారని పలువురు విమర్శిస్తున్నారు.
గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు అఘోరి
హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహేరా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరుకు వచ్చిన అఘోరి
అఘోరికి బెహేరా అనిల్ మధ్య కొద్ది రోజులుగా వివాదం
గుంటూరుకు వస్తున్న అఘోరిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తెచ్చిన పోలీసులు
తనపై… pic.twitter.com/k2KKoiMRfY
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025