E-Paper
Advertisement

Spain vs Germany : డ్రా అయిన హోరాహోరీ పోరు

Spain vs Germany : డ్రా అయిన హోరాహోరీ పోరు
Advertisement

Spain vs Germany : ఫిఫా వరల్డ్‌కప్‌లో రెండు పెద్ద జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1 గోల్స్ తో డ్రాగా ముగిసింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్, 11వ ర్యాంకర్ జర్మనీ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ డ్రా అవడంతో… రెండు దేశాల అభిమానులు నిరుత్సాహపడ్డారు. ముఖ్యంగా స్పెయిన్ ఫ్యాన్స్…. తమ అభిమాన జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి ప్రీక్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుందని ఆశించారు. కానీ… జర్మనీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. గేమ్ మొదలైనప్పటి నుంచీ స్పెయిన్, జర్మనీ నువ్వా? నేనా? అన్నట్లు తలపడ్డాయి. పరస్పరం గోల్ పోస్టుల మీద పదేపదే దాడులు కొనసాగించాయి. ఆట 39వ నిమిషంలో జర్మనీ ఆటగాడు ఆంటోనియో రూడిగర్ గోల్ చేసినా అతను ఆఫ్ సైడ్ పొజిషన్లో ఉండటంతో… రిఫరీ ఇవ్వలేదు. చివరికి రెండు జట్లు గోల్ చేయకుండానే తొలి అర్ధభాగాన్ని ముగించాయి. సెకండ్ హాఫ్ మొదలయ్యాక… ఆట 56వ నిమిషంలో జర్మనీ ఆటగాళ్లు చేసిన గోల్ ప్రయత్నాన్ని స్పెయిన్ గోల్ కీపర్ విజయవంతంగా అడ్డుకున్నాడు. ఇక 62వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు అల్వారో మొరాటా… జట్టుకు ఏకైక గోల్ అందించాడు. స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి రావడంతో… ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, జర్మనీ ఏ మాత్రం పట్టువిడవకుండా పోరాడింది. 73వ నిమిషంలో జర్మనీ ఆటగాళ్లు చేసిన గోల్ ప్రయత్నాన్ని స్పెయిన్ గోల్ కీపర్ విజవంతంగా అడ్డుకున్నాడు. కానీ 83వ నిమిషంలో జర్మనీ గోల్ చేయడంలో సఫలమైంది. నిక్లాస్ ఫుల్ క్రుగ్ గోల్ కొట్టి… 1-1తో స్కోరును సమం చేశాడు. ఆట ముగిసే సమయానికి రెండు జట్లు మరో గోల్ చేయడంలో విఫలమయ్యాయి. అదనపు సమయం మరికొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా జర్మనీ చేసిన చివరి గోల్ ప్రయత్నాన్ని… స్పెయిన్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. దాంతో మ్యాచ్ 1-1 గోల్స్ తో డ్రాగా ముగిసింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×