కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇతరులకు మించిన స్పెసిలిటీస్ కల్పిస్తాయి. కొంత మంది క్రేజీగా ఆలోచిస్తారు. ఎవరూ ఊహించని విధంగా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. తాజాగా దుబాయ్ లోనూ ఇలాంటి ప్రయత్నమే జరిగింది. హెయిర్ సెలూన్ ఓనర్ ఏకంగా.. కస్టమర్లను ఎంటర్ టైన్ చేసేందుకు డ్యాన్సర్లను పెట్టి బెల్లీ డ్యాన్స్ వేయించడం మొదలుపెట్టాడు. ఈ క్రేజీ ఆలోచన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయన సెలూన్ కు గుర్తింపు తీసుకొచ్చేలా చేసింది.
వినూత్నంగా కస్టమర్లను ఆహ్లాదపరచాలని..
దుబాయ్‌లోని ఒక లగ్జరీ మెన్ సెలూన్ లో VIP కస్టమర్ల కోసం ప్రత్యేక సెక్షన్ ఉంటుంది. ఇందులో ఓన్లీ రిచ్ పీపుల్ కు మాత్రమే హెయిర్ కటింగ్ చేస్తారు. అంతేకాదు, ఇక్కడ కటింగ్ చేయించుకోవాలంటే మామామూ వాళ్లకు సాధ్యం కాదు. ఎందుకంటే, ఇక్కడ సింగిల్ కటింగ్ కు 47,000 డాలర్లు ఛార్జ్ చేస్తారు. అంటే భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ.41 లక్షలు. వామ్మో అంత ధరా అని ఆశ్చర్య పోవచ్చు. ధనవంతుల కటింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.
కస్టమర్లను ఎంటర్ టైన్ చేసేందుకు బెల్లీ డ్యాన్స్
వచ్చేది VIP కస్టమర్లు కావడంతో వారికి బోర్ కొట్టకుండా ఎంటర్ టైనింగ్ ఏర్పాట్లు చేశాడు సెలూన్ ఓనర్. అదిరిపోయే డ్యాన్సర్లతో బెల్లి డ్యాన్స్ చేయిస్తున్నారు. రెండు షిఫ్టులలో నలుగురు డ్యాన్సర్లను ఏర్పాటు చేశారు. షిఫ్టుకు ఇద్దరు ముగ్గురు చొప్పున డ్యాన్స్ చేస్తారు. థియేటర్ అనుభూతి కలిగించేందుకు ఓ డీజేను కూడా ఏర్పాటు చేశారు. ఆయన మ్యూజిక్ అందిస్తుంటే, ఆ మ్యూజిక్ కు తగినట్లుగా డ్యాన్సర్లు అదిరిపోయే బెల్లీ డ్యాన్స్ చేస్తారు. కస్టమర్లు ఫుల్ ఎంటర్ టైన్ అవుతారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇక ఈ సెలూన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కటింగ్ ధర చూసి కొంత మంది భయపడినా, మరికొంత మంది రిచ్ పీపుల్ కు పెద్ద ఇబ్బంది ఏమీ కాదని చెప్పుకొస్తున్నారు. ఇక కటింగ్ చేసే సమయంలో డ్యాన్సర్లను చూడాలనిపిస్తే, కత్తితో మెడ తెగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదో పిచ్చి ఆలోచన అని మరికొంత మంది కామెంట్స్ చేస్తే, ఎలాగైనా పాపులర్ కావానే వారికి ఇలాంటి ఆలోచనలే వస్తాయని మరికొంత మంది చెప్తున్నారు. ఎప్పటికైనా ఈ పద్దతి ప్రమాదాన్నే తెచ్చిపెడుతుందని మరికొంత మంది జోస్యం చెప్తున్నారు. ఏవడో ఒకడు చస్తే, అప్పుడు ఈ డ్యాన్స్ ఆగిపోతుందని మరికొంత మంది సీరియస్ గా కామెంట్స్ పెడుతున్నారు. ఏ నాటికైనా ఆ సెలూన్ లో కటింగ్ చేయించుకోవాలని కొందరు అంటుంటే.. ఉన్న ఆస్తులు అమ్ముకుంటేనే అది సాధ్యం అవుతుందని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా దుబాయ్ లగ్జరీ సెలూన్, బెల్లీ డ్యాన్స్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది.
Read Also: ఎంత చిన్న సందులో నుంచి దూరితే అంత ఎక్కువ డిస్కౌంట్, ఆఫర్ భలే ఉంది గురూ!