BigTV English

Sports Streaming App: నష్టాల్లో స్పోర్ట్స్ స్ట్రీమింగ్ యాప్.. త్వరలోనే మూసివేత..

Sports Streaming App: నష్టాల్లో స్పోర్ట్స్ స్ట్రీమింగ్ యాప్.. త్వరలోనే మూసివేత..

Sports Streaming App: ప్రస్తుతం ఓటీటీ యాప్స్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే థియేటర్లలో విడుదలయిన సినిమాలు.. టీవీలో వచ్చేవరకు ఆగకుండా ముందే ప్రేక్షకుల దగ్గరకు తీసుకొస్తున్నాయి ఈ ఓటీటీ సంస్థలు. అదే విధంగా గత కొన్నేళ్లుగా స్పోర్ట్స్ స్ట్రీమింగ్ యాప్‌కు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఎన్నో ఆశలతో ఇలాంటి యాప్స్ ప్రారంభించిన చాలామంది.. లాభాలు చవిచూస్తుండగా.. కొందరు మాత్రం నష్టపోతున్నారు.


‘బజర్’.. ఒక స్పోర్ట్స్ స్ట్రీమింగ్ యాప్‌గా ప్లే స్టోర్స్‌ను పలకరించింది. ప్రారంభమయిన తక్కువ సమయంలోనే చాలా పాపులారిటీని కూడా సంపాదించుకుంది. కానీ సడెన్‌గా యాప్‌ను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడంతో పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు నిరాశకు గురయ్యారు. యాప్ మూసివేయడం బాధగా ఉందంటూ మైకెల్ జోర్డన్, కెవిన్ డ్యురాంట్, నవోమి ఒసాకా.. వంటి స్పోర్ట్స్ సెలబ్రిటీలు ప్రకటించారు.

జెన్ జీ అనే స్పోర్ట్స్ స్ట్రీమింగ్ యాప్.. నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పుడు దాని స్థానాన్ని కాజేయడం కోసం బజర్ యాప్ ప్రారంభమయ్యింది. 2020 ప్రారంభమయిన ఈ యాప్.. మొత్తంగా 44 డాలర్ల పెట్టుబడిని సంపాదించుకుంది. ఎన్‌బీఏ, డబ్ల్యూఎన్‌బీఏ, ఎన్‌హెచ్ఎల్, పీజీఏ టూర్, ఏటీపీ టూర్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను కవర్ చేయడానికి బజర్ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ మూడేళ్లలోనే బజర్ తీవ్రంగా నష్టపోవడంతో ఇప్పుడు దానిని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


‘బరువెక్కిన గుండెతో మేము మా ఆపరేషన్స్‌ను ఆపేస్తున్నట్టు ప్రకటిస్తున్నాం. తాజాగా జరిగిన ఫండ్‌రైజింగ్ డెవలప్‌మెంట్స్, మార్కెట్ డైనమిక్స్‌ను చూసి ఈ నిర్ణయం తీసుకున్నాం. బజర్‌ను ఎంత డెవలప్ చేయడానికి ప్రయత్నించినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పడం లేదు’ అని బజర్.. తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. అంతే కాకుండా బజర్ ఫౌండర్, సీఈఓ బో హ్యాన్ కూడా ట్విటర్‌లో లైవ్ పెట్టి ఈ విషయాన్ని బయటపెట్టాడు. బజర్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది బాధాకరమైన విషయమని వాపోతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×