BigTV English

SRH: హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోతాం.. SRH ఆందోళన !

SRH: హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోతాం.. SRH  ఆందోళన !

SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా నేడు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా సాగర తీరాన నేడు సన్రైజర్స్ హైదరాబాద్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్ర ఆవేదనతో రాసిన లేఖ బయటకు వచ్చింది. తరచూ వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ {హెచ్సీఏ} మరో వివాదంలో చిక్కుకుంది.


 

ఐపీఎల్ మ్యాచ్ ల ఉచిత పాస్ ల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వేధిస్తుండడంతో.. ఆ ఫ్రాంచైజీ నగరాన్నే వీడి వెళ్తామని హెచ్చరించింది. ఈ మేరకు లేఖలో సన్రైజర్స్ హైదరాబాద్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. సాధారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఉప్పల్ స్టేడియం. తెలుగు క్రికెట్ అభిమానులు ఆరాధించే ఫ్రాంచైజీ. దీనికి సంబంధించిన మ్యాచులు జరిగే హోం గ్రౌండ్ ఉప్పల్ నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చూసుకుంటుంది.


అయితే గత రెండు సంవత్సరాలుగా తమకు ఉచిత టికెట్లు మరిన్ని కావాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బెదిరింపులకు పాల్పడుతూ.. బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపించింది. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పలుమార్లు బెదిరించారని పేర్కొంది. తాము కోరినన్ని ఉచిత పాస్ లు ఇవ్వనందున ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్ కి తాళాలు వేసిన విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ బయటపెట్టింది.

సన్రైజర్స్ హైదరాబాద్ లేఖలో ఈ విధంగా పేర్కొంది. ” ఉచిత టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఎదురవుతున్న బెదిరింపుల నేపథ్యంలో తీవ్ర ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నాం. మేం గత 12 సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి పనిచేస్తున్నాం. కానీ గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఎన్నో ఏళ్లుగా మాకు ఉన్న ఒప్పందం ప్రకారమే హెచ్సీఏ కి 3900 కాంప్లిమెంటరీ టికెట్లు, అందులోనే 50 కాంప్లిమెంటరీ టికెట్లు { ఎఫ్ 12 ఏ కార్పొరేట్ బాక్స్} టికెట్లు కేటాయిస్తున్నాం.

50 సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్ 12 ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ ఈ ఏడాది ఎఫ్ 12 ఏ కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే ఉన్నాయి. అదనంగా మరో బాక్స్ లోను 20 టికెట్లు కేటాయించాలని హెచ్సీఏ అడిగింది. దీనిపై చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని మేము తెలిపాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోకి వస్తుంది. దానికి అద్దె కూడా చెల్లిస్తున్నాం.

కానీ గత మ్యాచ్ లో f3 బాక్స్ కి తాళం వేశారు. అదనంగా మరో 20 ఉచిత టికెట్లు కావాలని, లేదంటే బాక్స్ తెరవమని చివరి నిమిషంలో బెదిరింపులకు దిగారు. మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదు. మ్యాచ్ మొదలవుతుండగా ఇలా బ్లాక్ మెయిల్ చేయడం అన్యాయం. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టం. వారు ఇలా బెదిరింపులకు పాల్పడడం తొలిసారి కాదు. గత రెండు సంవత్సరాలలో హెచ్సీఏ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. ఈ సంవత్సరం హెచ్సీఏ అధ్యక్షుడు పలుమార్లు బెదిరించారు.

 

దీన్ని సంఘం దృష్టికి తీసుకువచ్చాము. వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ ఆడడం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మా యాజమాన్యంతో సంప్రదించి ఇక్కడి నుండి వెళ్ళిపోతాము. మరో వేదికను చూసుకుంటాం. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈ విషయంపై చర్చించేందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం”. అని సన్రైజర్స్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ {స్పోర్ట్స్} శ్రీనాథ్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ వైరల్ గా మారడంతో క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×