BigTV English

Parliament Sessions: జూన్ 15న లోక్‌సభ తొలి సమావేశం!

Parliament Sessions: జూన్ 15న లోక్‌సభ తొలి సమావేశం!

Lok Sabha First Session updates(Telugu news headlines):18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 15న ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఈ సెషన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 2 రోజుల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగిన తర్వాత కొత్త స్పీకర్‌ను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు.


అనంతరం సెషన్ అధికారికంగా ప్రారంభిస్తారు. సమావేశాల నిర్వహణ తేదీలను కొత్త కేంద్ర మంత్రి వర్గం నిర్ణయిస్తుంది. తర్వాత మోదీ తన మంత్రి మండలి సభ్యులను ఉభయ సభలకు పరిచయం చేస్తారు. జూన్ 22న సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. భారత ప్రధానిగా వరుసగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం మోదీ రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా రాష్ట్రపతి భవన్‌లో భద్రత సమీక్ష నిర్వహించారు.

Also Read: పవనంటే ఒక తుపాన్.. జనసేనానిపై మోదీ ప్రశంసలు


ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా చోట్లు ప్రోటోకాల్ కూడా అమలు చేస్తున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నోఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. జూన్ 9,10 తేదీల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. పారామోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లు, డ్రోన్ , గాలి బుడగలు, రమోటెడ్ ఎయిర్ క్రాప్ట్‌లు ఎగురవేయడాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×